YS Sharmila: కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా..? ఆమెను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు? నా మీద దాడి జరిగితే కేసీఆర్‌దే బాధ్యత

కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆమెను గౌరవించినప్పుడు నన్ను ఎందుకు గౌరవించరంటూ షర్మిల ప్రశ్నించారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నా గతం, వర్తమానం, భవిష్యత్తు ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత అన్నారు.

YS Sharmila: కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా..? ఆమెను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు? నా మీద దాడి జరిగితే కేసీఆర్‌దే బాధ్యత

YS Sharmila

YS Sharmila: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాదయాత్ర సందర్భంగా నర్సంపేటలో దాడి జరిగిన విషయం విధితమే. ఈ దాడి విషయాన్ని వివరించేందుకు గురువారం గవర్నర్ తమిళిసై తో షర్మిల భేటీ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే తనపై దాడులు చేయించారని తమిళిసైకి షర్మిల ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబం పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు, వాటి పరిష్కారంకోసం ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు పాదయాత్రను ఓ యజ్ఞంలా చేస్తున్నానని షర్మిల అన్నారు. కానీ, నా పాదయాత్రను ఆపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని, నాపై దాడులు చేయించేందుకు కుట్ర చేస్తుందని, మా క్యాడర్‌ను ఆపలేమంటూ చెబుతున్నారని అన్నారు. కావాలనే శాంతిభద్రత సమస్యను సృష్టించారని షర్మిల ఆరోపించారు. ఇదంతా సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతుందని షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha Vs YS Sharmila : టీఆర్ఎస్ MLC కవిత ట్వీట్‌కు.. YS షర్మిల కౌంటర్ ట్వీట్

నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడానంట.. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అంటూ షర్మిల ప్రశ్నించారు. నన్ను మరదలు అని ఓ మంత్రి అంటే.. చెప్పుతో కొడతానన్నా అన్నారు. కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆమెను గౌరవించినప్పుడు నన్ను ఎందుకు గౌరవించరంటూ షర్మిల ప్రశ్నించారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నా గతం, వర్తమానం, భవిష్యత్తు ఇక్కడే .. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత అని షర్మిల అన్నారు. నాపై దాడులు చేయాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. నా మీద దాడి జరిగితే కేసీఆర్ దే బాధ్యత అన్నారు. తెలంగాణ ఆఫ్ఘానిస్తాన్ లా మారిందని, కేసీఆర్ తాలిబన్ నేతలా మారాడు, ఆయన పక్కన ఉన్నది తాలిబన్ల సైన్యమే అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, వారి కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్నారని షర్మిల ఆరోపించారు. వందల కోట్లు ఎలా సంపాదించారు? కేసీఆర్ కుటుంబానికి వేలకోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రగతి భవన్, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్ల‌లో రెయిడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. మునుగోడులో టీఆర్ఎస్ ఎంత ఖర్చుపెట్టిందో విచారణ జరగాలని షర్మిల అన్నారు.