Ys Sharmila Nirahara Deeksha : ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరసన దీక్ష

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు.

Ys Sharmila Nirahara Deeksha  : ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరసన దీక్ష

Kmm Ys Sharmila Deeksha

Ys Sharmila Nirahara Deeksha : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన  నిరాహార దీక్ష చేపట్టారు. కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో గంగదేవిపాడు మండలానికి చెందిన నిరుద్యోగి సానిక నాగేశ్వరరావు ఇటీవల పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మొదట గ్రామానికి చేరుకున్న ఆమె నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిల ముందు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధ పడవద్దని… మనో ధైర్యాన్ని కోల్పోవద్దని….కుటుంబానికి అండగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు.

అనంతరం పెనుబల్లిలో చేపట్టిన  నిరాహార  దీక్షలో షర్మిల పాల్గొన్నారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించి దీక్షకు కూర్చున్నారు.  నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని షర్మిల ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు  చేపట్టకపోవటంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

Ys Sharmila In Khamma District Penuballi Deeksha

Ys Sharmila In Khamma District Penuballi Deeksha                                                                                                                              పార్టీ అధ్యక్షరాలి హోదాలో షర్మిల  ఖమ్మం జిల్లాలో తొలిసారిగా పర్యటిస్తుండటంతో  నిరాహార సభను  విజయవంతం చేసేందుకు నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగ సంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ఇక జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వైఎస్ఆర్  అభిమానులు, నిరుద్యోగులు నిరాహార నిరసన దీక్షకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగనుంది.