YS Sharmila: వైఎస్సార్ మొదలుపెట్టిన చోటి నుంచే షర్మిల పాదయాత్ర

వైఎస్ షర్మిళ. 2012లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 230 రోజుల పాటు 116మ నియోజకవర్గాల్లో 3వేల 112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. చేవెళ్ల వేదికగా మరోసారి పాదయాత్రకు బయల్దేరారు.

YS Sharmila: వైఎస్సార్ మొదలుపెట్టిన చోటి నుంచే షర్మిల పాదయాత్ర

Ys Sharmila

YS Sharmila: ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన చోట నుంచే పాదయాత్ర ఆరంభించనున్నారు వైఎస్ షర్మిళ. 2012లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 230 రోజుల పాటు 116మ నియోజకవర్గాల్లో 3వేల 112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చేవెళ్ల వేదికగా మరోసారి పాదయాత్రకు బయల్దేరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం జులై 8నే పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు.

చేవెళ్లలో మొదలుపెట్టి 4వేల కిలోమీటర్లు పూర్తి చేసి అక్కడితోనే ముగించనున్నారు. మరో వైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే.. వైతెపా పార్లమెంట్ స్థానాలను ఎంచుకుని.. వాటికి కన్వీనర్లు, కో కన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపిందించారు. తొలి రోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాట వెంట్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను వైతెపా ఆహ్వానించింది.

మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. ఇదే మాదిరి రాష్ట్రంలోని దాదాపు అన్ని శాసన సభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్ మ్యాప్ ను పార్టీ శ్రేణులు రూపొందించాయి. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధిం రాంరెడ్డి తెలిపారు.

…………………………………………: డెన్మార్క్ ఓపెన్‌లో చెలరేగిన సింధు..

తొలి రోజు పాదయాత్రలో భాగంగా..
ప్రజాప్రస్థానం పేరుతో జరుగుతున్న పాదయాత్ర తొలి రోజులో భాగంగా చేవెళ్ల.. వికారాబాద్ రోడ్డులోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం 11గంటలకు బహిరంగ సభ… అరగంటసేపు జరిగిన తర్వాత నుంచి పాదయాత్ర మొదలవుతుంది. కందవాడ-నక్కలపల్లి శివారుకు చేరుకున్న షర్మిల రాత్రికి అక్కడే బస చేస్తారు.