YS Sharmila : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ ను ప్రశ్నిస్తే కేసులు.. జర్నలిస్టులకు అండగా ఉంటాం : వైఎస్ షర్మిల

జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.

YS Sharmila : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ ను ప్రశ్నిస్తే కేసులు.. జర్నలిస్టులకు అండగా ఉంటాం : వైఎస్ షర్మిల

YS Sharmila (1)

YS Sharmila Fire KCR : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ ను తప్పు పడితే తమపై కేసు పెట్టారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖపై విమర్శలు చేశామని కేసు పెట్టారని తెలిపారు. పోలీసుల చేత తనపై ఒక కేసు పెట్టించారని వెల్లడించారు. తమకు కేసులు కొత్త కాదన్నారు. ఇంతకముందు తనను ఒక్క రోజు జైల్లో కూడా పెట్టారని పేర్కొన్నారు. దేనికి బయపడబోమని స్పష్టం చేశారు. కేసీఅర్ ఒక నియంతని విమర్శించారు.

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న మహా ధర్నాలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిజం, జర్నలిస్టులకు సలామ్ తెలిపారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు గొంతు జర్నలిస్టులు అని అన్నారు. జర్నలిస్టులు అనే వారు లేకుంటే సమస్యలు బయటకు రావన్నారు. 9 ఏళ్ల బంగారు తెలంగాణలో జర్నలిస్టులు ఆందోళన చేయడం బాధాకరమని పేర్కొన్నారు.  జర్నలిస్టులు సన్మానం చేయమని అడగలేదని.. కేవలం వారికి రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని వెల్లడించారు.

YS Sharmila : వైఎస్ షర్మిలపై కేసు నమోదు

కేసీఆర్ జర్నలిస్టులను విస్మరించడం అన్యాయమన్నారు. వైఎస్సార్ హయాంలో జర్నలిస్టులకు ఎంతో నాయ్యం జరిగిందని గుర్తుచేశారు. వైఎస్సార్ హయంలోనే 70 ఎకరాలు జవహర్ లాల్ హౌజింగ్ సొసైటీకి కేటాయించారని.. అది కాస్త కేసుల్లో ఇరుక్కుందని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత ..అప్పుడున్న కాంగ్రెస్ కానీ, ఇప్పుడు కేసీఆర్ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో జిల్లాల్లో కలెక్టర్ల చేత ఎంతో మందికి ప్రభుత్వ స్థలాలు ఇప్పించారని పేర్కొన్నారు.

విద్య, వైద్యంలో వైఎస్సార్ పెద్ద పీట వేశారని కొనియాడారు. CMRF నుంచి ఎంతో మంది జర్నలిస్టులను వైఎస్సార్ ఆదుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఎంతో చేస్తే కేసీఆర్ మాత్రం జర్నలిస్టులను మోసం చేశారని విమర్శించారు. సొసైటీలో భూముల కేసు సుప్రీంకోర్టులో గెలిచినా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. అందరికీ వరాలు ఇచ్చి మోసం చేసినట్లే జర్నలిస్ట్ లను కూడా కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు.

YS Sharmila: అందుకే పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారా?: వైఎస్ షర్మిల

జర్నలిస్ట్ లను సైనికుల మాదిరిగా కేసీఅర్ పోల్చారని పేర్కొన్నారు. ఇన్ని మాటలు చెప్పిన కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వరంగల్ వెళ్లి అక్కడ కాలనీ కడుతామని చెప్పారని షర్మిల అన్నారు. హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పడేలా కాలనీ అన్నారని గుర్తు చేశారు. క్లబ్ హౌజ్ లు అన్నాడు.. సినిమా హాల్స్ అన్నాడు..మార్కెట్ లు అన్నాడు అని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అసలు జర్నలిస్ట్ లకు కనీస మర్యాద కూడా లేదని వాపోయారు. తమ పాదయాత్రలో జర్నలిస్టుల కష్టాలను చూశామని తెలిపారు.

బీఆర్ఎస్ నేతల అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులను కొడుతున్నారని, చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి లేదని బాధ పడని జర్నలిస్ట్ లేడన్నారు. పాదయాత్రలో తాను ఎమ్మెల్యేల అవినీతి గురించి చెప్పిన ప్రతి నిజం తనకు జర్నలిస్టులు చెప్పినవేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ జర్నలిస్టులు పక్షాన కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

YS Sharmila : టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని.. గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి అని కోరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరుపున తమ మ్యానిఫెస్టోలో పెడుతున్నామని.. ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలం కేటాయిస్తామని మాట ఇస్తున్నామని చెప్పారు. జర్నలిస్టుల పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. జర్నలిస్టుల సమస్య కోసం తాను పోరాటం చేస్తానని చెప్పారు.