నేను పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదు: షర్మిల

నేను పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదు: షర్మిల

తెలంగాణలో రాజకీయపార్టీ ఏర్పాటు విషయంలో వేగంగా అడుగులు వేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల.. వరుసగా తెలంగాణలో భేటి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో భేటీ అయ్యారు. భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని, నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో? అన్ననే అడగాలని అన్నారు. కేసీఆర్, విజయశాంతి తెలంగాణ వారేనా? అంటూ ఆమె ప్రశ్నించారు.

త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. నా స్థానికతను గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, విద్యార్ధి జీవితం మొత్తం కూడా తెలంగాణలోనే గడిపినట్లు ఆమె చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేకపోయినా.. విజయమ్మ మద్దతు ఉందని ఆమె అన్నారు.

తెలంగాణాలో త్వరలో యాత్ర కూడా చెయ్యబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పిన షర్మిల.. మే 14వ తేదీన జులై 8వ తేదీన రెండు తేదీలను కూడా ఆమె నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఎప్పుడు పార్టీ ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు..