YS Sharmila: ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర.. వరంగల్ వెళ్తా: షర్మిల

ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తానని, వరంగల్ కు తిరిగి వెళ్తానని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అదనపు డీజీ జితేందర్ ను కలిసి భద్రత కల్పించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. శంకరం తండా శివారులో షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు.

YS Sharmila: ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర.. వరంగల్ వెళ్తా: షర్మిల

YS Sharmila

YS Sharmila: ఆగినచోటి నుంచే మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తానని, వరంగల్ కు తిరిగి వెళ్తానని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అదనపు డీజీ జితేందర్ ను కలిసి భద్రత కల్పించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. శంకరం తండా శివారులో షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు.

ఆ తర్వాత షర్మిలను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. ఆ తదుపరి రోజే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా ఆమెను పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల ఎల్లుండి నుంచి మళ్ళీ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అదనపు డీజీ జితేందర్ ను కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 3,525 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశానని అన్నారు.

Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు

పోలీసులే శాంతి భద్రతలను కాపాడాలని, ఆ బాధ్యత వారిదేనని షర్మిల చెప్పారు. డిసెంబరు 14న పాదయాత్ర ముగుస్తుందని తెలిపారు. అదే రోజు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుందని అన్నారు. పోలీసులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటోందని చెప్పారు. పట్టపగలే టీఆర్ఎస్ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..