Sharmila : కరోనాను ఎదుర్కోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : షర్మిల

Sharmila : కరోనాను ఎదుర్కోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : షర్మిల

Ys Sharmilas Criticisms On The Trs Government At Corona Control

YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల జులై 8న పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనాను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.కరోనా నియంత్రణ..వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రపై రాష్ట్ర ప్రభుత్వం..రాష్ట్రంపై కేంద్రం విమర్శలు చేసుకోవటానికే సరిపోతోందని ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజల కష్టాల్ని మాత్రం పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. ఈక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటం గురించి కూడా ఆమె స్పందించారు. ఈటల రాజేందర్ కేసుల భయంతోనే బీజేపీ లోకి వెళుతున్నారని అన్నారు. ఆయనకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టే బీజేపీలోకి వెళుతున్నారని..కానీ ఆయన్ని ఆయన కాపాడుకోవటం మంచిదేనన్నారు. పార్టి నుంచి రావటం మంచి నిర్ణయమని..నేను తెలంగాణలో పార్టీ పెడతానని నిర్ణయం తీసుకుని..పార్టీ దిశగా నడుసున్న క్రమంలో నేను వైఎస్సార్ షాడో గా ys’s’r అని కొన్ని మీడియాలు రాశాయని అన్నారు. అలాగే ఆనందయ్య కరోనా మందు గురించి కూడా మాట్లాడిన షర్మిల ఆనందయ్య మందు బాగుందా ? ఎలా ఉంది? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టటానికి దూకుడు పెంచిన షర్మిల వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో జులై 8న కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెడతున్నామని ప్రకటించారు. పార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశమయ్యారు. అనంతరం జులై 8న పార్టీ పెడుతున్నామని ప్రకటించారు.జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ఈ సన్నాహాక సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళే ప్రకటించనున్నారు. కాగా..షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా నిన్ననే ఆపార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పేరును లాంఛనంగా ప్రకటించనున్నారు.

పార్టీ ప్రకటన విషయమైన వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పార్టీ విధానం ఉంటుందని తెలిపారు. మా పార్టీకి ప్రజలందరి భాగస్వామం చాలా అవసరమని మీ రాజన్న బిడ్డగా నన్ను ఆశీర్వదించి సహకరించాలని షర్మిల కోరారు. మన పార్టీలో ప్రజల సమస్యలు తెలుసుకునేవారు మాత్రమే పార్టీ నాయకులుగా ఉంటారని స్పష్టంచేశారు. కాగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ షర్మిల వాడి వేడి మాటలు ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో ఇటీవల కాలంలో పలు విమర్శలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు వంటి పలు అంశాలపై అధికారపార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.