YS Sharmila Padayatra : ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలో షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

YS Sharmila Padayatra : ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila Padayatra  :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలో షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. గతంలో ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో అడ్కడి నుంచే పాదయాత్ర సాగనుంది. 4 వేల కిమీ మైలు రాయి వరకు పాదయాత్ర సాగనుంది. వరంగల్ లో భారీగా పాదయాత్ర ముగింపు సభ ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా తమ వాహనంపై గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. కానీ పాదయాత్రలో తాము ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.

షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. నవంబర్ 4 నాటికి ఆమె పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో తెలంగాణలో ఈ ఘనత సాధించిన మహిళా నేతగా షర్మిల అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం 2021, జూలై 8న షర్మిల ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)’ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించారు. అనంతరం తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాల‌న తీసుకురావటమే ల‌క్ష్యంగా ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.

Sharmila padayatra..HC ermission : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..షరతులు వర్తిస్తాయని సూచించిన ధర్మాసనం

ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 20న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించేందుకు ఒక కారణం ఉంది. గతంలో షర్మిల తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఆయన 2003 ఏప్రిల్‌లో చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు.

అందుకే సెంటిమెంట్‌గా భావించి తన తండ్రిలాగే చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలుపెట్టారు.  షర్మిల చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్రకు తెలంగాణలో విశేష ఆదరణ లభించింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో షర్మిల మమేకం అవుతున్నారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అనేక చోట్ల సభలు నిర్వహించారు. ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా పలు చోట్ల ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.