YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

Ys Sharmila Padayatra

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ   ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఆమె తన పాదయాత్రను మధ్యలోనే ముగించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి తన పాదయాత్రను  నార్కట్ పల్లి మండలం నుండే తిరిగి ప్రారంభిస్తాను అని ఆమె తెలిపారు.

రైతుల వద్దనుంచి ప్రభుత్వం ఆఖరి గింజ వడ్లుకొనేంతవరకు పోరాడతానని ఆమె చెప్పారు. రైతుల వ‌డ్ల‌ను చివ‌రి గింజ వ‌ర‌కు కొనాల‌ని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. 72 గంట‌ల పాటు పార్టీ ఆధ్వ‌ర్యంలో నిరాహార దీక్ష చేస్తానని…. తన పార్టీ రైతుల ప‌క్షాన ఎల్ల‌ప్పుడూ నిల‌బ‌డుతుందని ఆమె అన్నారు.
Also Read : Family End lives: చూడమని ఇచ్చిన బిడ్డను మాయం చేసింది…కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు
గ‌తంలో కేంద్ర పెత్తనం ఏంటి? ఆఖ‌రి గింజ వ‌ర‌కు తామే కొంటామ‌ని కేసీఆర్ మాట ఇచ్చారని… ఇప్పుడేమో మాట తప్పారని ఆమె ఆరోపించారు. ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా వ‌డ్లు కొనేలా చేస్తాం అని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు.   కేసీఆర్ లో అభ‌ద్ర‌తాభావం నిండుకుందని….కేసీఆర్ అంటేనే వాస్త‌వాల‌కు విరుద్ధం అని ఆమె విమర్శించారు.  పెట్రోల్, డీజిల్ విష‌యంలోనూ, రైతుల విష‌యంలోనూ నిజాల కంటే అబ‌ద్ధాలే ఎక్కువ‌గా కేసీఆర్ చెబుతున్నారని ఆమె అన్నారు. 21 రోజుల పాటు సాగిన యాత్రలో ఆరు నియోజకవర్గాల పరిధిలో 150 గ్రామాలు సందర్శించారు.