YS Sharmila : తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP, జై తెలంగాణ అనే హక్కు వీళ్లెవ్వరికి లేదు

నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?

YS Sharmila : తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP, జై తెలంగాణ అనే హక్కు వీళ్లెవ్వరికి లేదు

YSRTP ys sharmila

YS Sharmila – Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. హైదరాబాద్ బోడుప్పల్ అభయ ఆసుపత్రిలో అడ్వకేట్ యుగంధర్ ను పరామర్శించిన సందర్భంగా రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. నాది ఆంధ్ర అని అంటున్నారు నాది ఆంధ్రా అయితే మరి మీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీది ఎక్కడ? ఇటలీ కదా? అని ప్రశ్నించారు. ఒక ప్రాంతాన్ని వదిలేసి.. సొంత వాళ్ళను కాదు అనుకొని… ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు.. బిడ్డలను కానీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ. ఇది మన దేశ సంస్కృతి, గొప్పదనం.. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలి అంటూ విరుచుకుపడ్డారు.

రేవంత్ రెడ్డి నాకు చీర, సారే పెడతాడట.. కానీ ఇక్కడ రాజకీయాలు చేయొద్ధట.. ఈ లెక్కన సోనియా గాంధీకి చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని చెప్పే రేవంత్ రెడ్డికి దమ్ముందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నారు నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని భయం.. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు షర్మిల.

తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP.. తెలంగాణ అనే పదం ఉన్న పార్టీ , ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ YSRTP అని అన్నారు. జై తెలంగాణ అనే దమ్ము ఉన్నది వైఎస్ షర్మిలకు మాత్రమేనని.. జై తెలంగాణ అనే పదం రేవంత్ రెడ్డికి, కేసీఅర్ కి, మోడీకి , సోనియాకు అనే హక్కు లేదు అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అట.. ముందు ఆ సంగతి ఏంటో చూడు రేవంత్ రెడ్డీ అంటూ సెటైర్లు వేశారు షర్మిల..