YS Sharmila : ఇందిరా పార్క్ వద్ద వైఎస్‌ షర్మిల రైతు వేదన నిరాహార దీక్ష

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు.

YS Sharmila : ఇందిరా పార్క్ వద్ద వైఎస్‌ షర్మిల రైతు వేదన నిరాహార దీక్ష

Sharmila (2)

YS Sharmila : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు. 72 గంటల పాటు వైయస్ షర్మిల దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద షర్మిల దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలవరకు అక్కడే దీక్షలో కూర్చొని ఆ తర్వాత లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు షర్మిల.. మిగతా 48 గంటలు ఆమె పార్టీ కార్యాలయంలోనే దీక్ష చేయనున్నారు. ఇక షర్మిల దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌టీపీ నాయకులు కార్యకర్తలు ఇందిరా పార్క్ వద్దకు తరలి వచ్చారు.

చదవండి : YS Sharmila Deeksha : వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు అనుమతి నిరాకరణ

ఇదిలా ఉంటే ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలుపై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీలు ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రైతుల పట్ల కేంద్ర విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అలాగే రైతులు అందరూ పాల్గొన్నారు.

చదవండి : YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

దీక్ష సందర్బంగా మాట్లాడిన షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెడుతున్నారని అన్నారు. యాసంగి పేరు చెప్పి వానాకాలం వడ్లను కొనకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని.. ఇక్కడ మద్దతు ధరకు కూడా ఎందుకు కొనలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్.. రా రైస్ పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని.. రైతులు వడ్లు పండించి మిల్లుకు ఇస్తే అవి ఏ బియ్యం తియ్యాలో మిల్లులు డిసైడ్ చేస్తాయని..కావలసిన విధంగా వడ్లను నూర్పిడి చేసి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారమే.