ఎల్లుండి సీఎం కేసీఆర్ తో సినీ ప్రముఖుల భేటీ... షూటింగ్స్ కు అనుమతి, సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ 

telugu cinema celebrities meeting with CM KCR on day after tomorrow

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎల్లుండి తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. షూటింగ్ లకు అనుమతి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమపై పడిన ప్రభావాన్ని సీఎంకు వివరించనున్నారు. (మే 21, 2020) చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సినిమా ఆటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజు, కొరటాల శివ, హీరో నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, త్రివిక్రమ్, సి.కళ్యాణ్, రాధాకృష్ణ, నాగవంశీ హాజరయ్యారు. షూటింగ్స్, థియేటర్లకు అనుమతిపై చర్చించారు.  

లాక్ డౌన్ సందర్భంగా సినీ పరిశ్రము ఏర్పడి ఇబ్బందిపై చర్చించారు. సినీ ప్రముఖులకు తలసాని హామీ ఇచ్చారు. పోస్టు ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 

సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్ కు అనుమతి, థియేటర్ల ఓపెన్ పై చర్చించామని మంత్రి తలసాని తెలపారు. పోస్టు ప్రొడక్షన్ కు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. మిగిలిన అంశాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సినిమా పరిశ్రమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. 

కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా సినీ ఇండస్ట్రీ పూర్తి స్థంభించిపోయింది. 
సినీ పరిశ్రమలో ఉండే కార్మికులు ఉపాధి కోల్పోయారు. పెట్టుబడులు నష్టపోయాయి. వీటన్నింటీపై చర్చించారు. అయితే ఒకవైపు లాక్ డౌన్ నిబంధనలు..మరోవైపు ఈనెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆయా రంగాలకు సడలింపులు వస్తోంది. అలాగే సినీ ఇండస్ట్రీకి కూడా కొన్ని సడలింపు ఇవ్వాలని సినీ పరిశ్రమ నుంచి వాదన వస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి తలసాని ముందు పెట్టారు. కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరారు. సినిమా షూటింగ్స్ అంటే దాదాపు 3 వందల నుంచి వెయ్యి మంది ఉంటారనే ఆలోచన అందరికీ ఉంటుంది. 

అలా కాకుండా కూడా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. చాలా తక్కువ మందితో సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి.. ఇలాంటి వాటికన్నా అనుమతించాలని కోరుతున్నారు. కొన్ని సడలింపులతో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా నడుచకుుంటామని ఈ మేరకు తమకు అనుమతించాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ తో ఎల్లుండి సమావేశం అవుతారని తెలుస్తోంది.  


 

మరిన్ని తాజా వార్తలు