లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

దర్శకుడిపై అభిమానం : ఒక్క రూపాయికే క్వార్టర్ సీసా

Published

on

Telugu Director N.Shankar Marriage Day : ఫిలిం డైరెక్టర్ శంకర్ పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమాని..ఓ ఆఫర్ పెట్టాడు. ఒక్క రూపాయికే క్వార్టర్ సీసా అందిస్తానని చెప్పాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లో చోటు చేసుకుంది. చింతకుంట విష్ణు శంకర్ అభిమాని. ఆయన పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా వినూత్న కార్యక్రమం చేయాలని భావించాడు. ఒక్క రూపాయికే క్వార్టర్ మందు సీసా ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాదు..బ్యానర్ కూడా వేయించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అన్నదానం కూడా ఉందని బగ్గ తినిపోవాలని బ్యానర్ లో వెల్లడించాడు.

ముందుగానే..ఓ వైన్స్ షాపుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎక్కువ సీసాలు పట్టుకెళుతారనే ఉద్దేశ్యంతో..ముందుగా..వారికి ఓ కాగితం ఇచ్చాడు. ఆ కాగితాన్ని వైన్స్ షాపులో చూపిస్తే..ఒక్క క్వార్టర్ ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ ఇతను చేసిన పనిపై విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ సార్ పై అంత అభిమానం ఉంటే..లేని వారికి ఏదైనా సహాయం చేస్తే బాగుండేదని అంటున్నారు.

చలికాలం ఇంటికో రగ్గు ఇస్తే బెటర్ గా ఉండేదని, నలుగురు మెచ్చుకుంటుండే కదా అంటున్నారు. బగ్గ తాగి..ఇంట్లో సతాయించేనికి క్వార్టర్ సీసాలు పంచుతరా ? ఈ పనిని డైరెక్టర్ సార్ మెచ్చరు కదా అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *