Google Gemini Ultra : జెమినిగా మారిన గూగుల్ బార్డ్.. ఇప్పుడు అల్ట్రా కూడా.. భారత్‌‌లో ఈ ఏఐ మోడల్ ధర ఎంత? ఎలా వాడాలో తెలుసా?

Google Gemini Ultra : గూగుల్ బార్డ్ జెమినిగా మారింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం గూగుల్ స్టాండర్డ్‌‌లోన్ జెమిని యాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు జెమిని అల్ట్రా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

Google Bard renamed to Gemini Ultra now available

Google Gemini Ultra : ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ మరింత వృద్ధిచెందుతోంది. టెక్ కంపెనీలు పోటాపోటీగా ఏఐ రేసులో దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ కొత్త ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అనేక కీలక ప్రకటనలను చేసింది. అందులో ప్రధానంగా గూగుల్ బార్డ్‌ని జెమినిగా పేరు మార్చింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త స్టాండర్డ్‌లోన్ జెమిని యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ యాప్‌లో ఐఓఎస్ యూజర్లకు జెమిని యాక్సెస్‌ను అందించింది.

ఇందులో జెమిని అడ్వాన్స్‌డ్ లాంచ్ సహా అనేక ప్రకటనలు చేసింది. జెమిని అడ్వాన్స్ అంటే ఏమిటో తెలియని వారు చాట్ జీపీటీ ప్లస్ గురించి ముందు తెలుసుకోవాలి. చాట్‌జీపీటీ ప్రీమియం మోడల్ మాదిరిగానే జెమిని అడ్వాన్స్‌డ్ సబ్‌స్క్రిప్షన్‌పై అందుబాటులో ఉంటుంది. జెమిని అడ్వాన్స్‌డ్ అనేది గూగుల్ అత్యంత అధునాతన మల్టీమోడల్ మోడల్ కాగా.. ఇది జెమిని అల్ట్రాపై ఆధారపడి పనిచేస్తుంది.

Read Also : Bard AI chatbot : ప్రపంచవ్యాప్తంగా యువత కోసం బార్డ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి.. గూగుల్ సడెన్ యూటర్న్ ఎందుకంటే?

జెమిని అడ్వాన్స్ గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా గూగుల్ బార్డ్ జెమినిగా ఎలా రూపాంతరం చెందిందో తెలుసుకోవాలి. గూగుల్ ఇటీవల జెమినీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఏఐ మల్టీ మోడల్. ఈ జెమినీ మొత్తం (నానో, ప్రో, అల్ట్రా) మూడు సైజుల్లో వస్తుంది. అందులో జెమిని నానో కూడా ఉంది. ప్రాథమికంగా ఆన్-డివైస్ టాస్క్‌ల కోసం జెమిని ప్రో ఉంది. ఇది అనేక రకాల టాస్క్‌లను వేగంగా పూర్తి చేయగలదు. నానో కన్నా ప్రో మోడల్ కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఆపై జెమిని అల్ట్రా అనేది అతిపెద్దది. జెమిని అత్యంత సామర్థ్యం గల వెర్షన్‌గా చెప్పవచ్చు.

Google Bard renamed to Gemini  

ఆన్‌లైన్‌‌లో 40 భాషల్లో అందుబాటులో :
సెర్చ్ దిగ్గజం ప్రకారం.. అత్యంత క్లిష్టమైన పనులను పూర్తి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పటివరకు.. జెమినీ నానో, జెమిని ప్రో బార్డ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అధునాతన సాంకేతికతను మరింత క్రమబద్ధీకరించడానికి గూగుల్ కంపెనీ ఫిబ్రవరి 8న బార్డ్‌కు జెమిని అనే కొత్త పేరును ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ఆన్‌లైన్‌లో 40 భాషల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం కొత్త జెమిని యాప్ ఐఓఎస్‌లోని గూగుల్ యాప్ ద్వారా త్వరలో యాక్సెస్ చేసుకునేందుకు అనుమతించనుంది.

జెమిని అల్ట్రా అంటే ఏమిటి? :
అల్ట్రాకు విషయానికి వస్తే.. గూగుల్ ఇటీవలి ప్రకటించిన వాటిలో జెమిని అల్ట్రా పేరు మారింది. ఇప్పుడు జెమిని అడ్వాన్స్‌డ్‌గా పిలుస్తున్నారు. ఈ అడ్వాన్సడ్ వెర్షన్ రీజనింగ్, సూచనలను అనుసరించడం, కోడింగ్ వంటివి టాస్క్ పూర్తిచేయగలదని గూగుల్ చెబుతోంది.

భారత్‌లో జెమిని అడ్వాన్స్ ధర :
జెమిని అడ్వాన్స్‌ను గతంలో దీన్ని డ్యూయెట్ ఏఐగా పిలిచేవారు. గూగుల్ వన్ ఏఐ ప్రీమియం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. దేశంలోని వినియోగదారులకు నెలకు రూ. 1,950 నుంచి ఈ జెమిని ఏఐ సర్వీసు ప్రారంభమవుతుంది. అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్‌లో గూగుల్ అడ్వాన్స్‌కి యాక్సెస్‌తో పాటు, వినియోగదారులు 2టీబీ స్టోరేజ్‌ని జీమెయిల్, డాక్స్, స్లయిడ్‌లు, షీట్‌లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో 2టీబీ స్టోరేజ్‌ను కూడా పొందవచ్చు.

 Gemini Ultra Advanced

జెమిని అడ్వాన్స్ ఎలా ఉపయోగించాలి? :
గూగుల్ వన్ ఏఐ ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎవరైనా జెమిని అడ్వాన్స్‌డ్‌ని ఉపయోగించవచ్చు. కొత్త ఏఐ ప్రీమియం ప్లాన్ పాపులర్ గూగుల్ వన్ సర్వీసు ఆధారంగా రూపొందించారు. హై స్టోరేజీతో పాటు ప్రత్యేకమైన ప్రొడక్టు ఫీచర్‌లను అందిస్తుంది. భారత్‌‌లో ఈ సర్వీసు ధర నెలకు రూ. 130 నుంచి ప్రారంభమవుతుంది.

జెమిని అడ్వాన్స్‌తో డ్యూయెట్ ఏఐ ద్వారా అందించిన హెల్ప్ మి రైట్ వంటి ఫీచర్‌లను యూజర్‌లు యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం వర్క్‌స్పేస్ కోసం జెమిని అని పిలుస్తారు. ప్రాథమికంగా జెమిని అడ్వాన్స్ సబ్‌స్క్రైబర్‌లు జీమెయిల్, డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, మీట్ వంటి వర్క్‌స్పేస్ యాప్‌లలో కూడా జెమిని అల్ట్రా సామర్థ్యాలను ఉపయోగించవచ్చు.

Read Also : Moto G04 Launch India : కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? మోటో G04 వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు