Motorola Razr 40 Series : ఈ మోటోరోలా రెజర్ 40 మడతబెట్టే ఫోన్లపై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. కొత్త ధర ఎంతంటే?

Motorola Razr 40 Series : మోటోరోలా రెజర్ 40 సిరీస్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ రెజర్ 40 ఫోన్లపై రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. కొత్త ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Motorola Razr 40 Ultra, Razr 40 Prices in India Slashed

Motorola Razr 40 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలా క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 10వేలు ధర తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు.. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది.

అయితే, మోటోరోలా రెజర్ 40 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. మోటోరోలా రెండు మోడల్‌లు 6.9-అంగుళాల ఓఎల్ఈడీ ఎల్‌టీపీఓ ఇంటర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా మోడల్ 30డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే, రెజర్ 40 ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

భారత్‌లో మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40 ధర ఎంతంటే? :
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40 ధరలను రూ. 10వేలకు తగ్గించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ధర తగ్గింపుతో రెజర్ 40 అల్ట్రా ఇప్పుడు రూ. 79,999కు కొనుగోలు చేయొచ్చు. మోటరోలా రేజర్ 40 సింగిల్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒరిజినల్ లాంచ్ ధర రూ. 89,999 ఉండగా.. ప్రస్తుతం సింగిల్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వెర్షన్‌కి బదులుగా రూ. 49,999కు పొందవచ్చు. అల్ట్రా మోడల్ ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple iPhone 16 Series : వీడియోల కోసం రాబోయే ఆపిల్ ఐఫోన్ 16లో స్పెషల్ బటన్.. ఇదేలా పనిచేస్తుందంటే?

మోటరోలా రేజర్ 40 సేజ్ గ్రీన్, సమ్మర్ లిలక్, వెనిలా క్రీమ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది కాకుండా, మోటోరోలా డిసెంబర్ 24 వరకు కొనసాగే మోటో డేస్‌లో భాగంగా రెండు స్మార్ట్‌ఫోన్‌లపై పరిమిత-కాలపు డిస్కౌంట్లను అందిస్తోంది. కొనుగోలుదారులు రెజర్ 40 అల్ట్రా కొత్త ధరపై రూ. 7వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రెజర్ 40 కొత్త ధరపై రూ. 5వేలు డిస్కౌంట్, ఇంకా, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి.

మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40 స్పెసిఫికేషన్స్ :
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40 రెండూ ఆండ్రాయిడ్ 13-ఆధారిత (MyUX)పై రన్ అవుతాయి. గతంలో 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ ఫోల్డబుల్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల (1,056×1,066 పిక్సెల్‌లు) పీఓఎల్ఈడీ ఔటర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా రెజర్ 40 మోడల్ 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్ పోలెడ్ మెయిన్ డిస్‌ప్లే, 1.5-అంగుళాల ఓఎల్ఈడీ ఔటర్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

Motorola Razr 40 Ultra, Razr 40 Prices in India

మోటోరోలా రెజర్ 40 అల్ట్రా హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీని కలిగి ఉంది. అయితే, మోటోరోలా రెజర్ 40 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. ఈ రెండు మోడల్స్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. రెజర్ 40 అల్ట్రా ఫోన్ 13ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్టుతో 12ఎంపీ ప్రైమరీ కెమెరాను పొందుతుంది.

రెజర్ 40లో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తాయి. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా 30డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రెజర్ 40 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. నీటి నిరోధక ఐపీ52 రేటింగ్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Ultra Leak : టైటానియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ అప్‌గ్రేడ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు