MG Hector Variant : రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఎంజీ హెక్టార్ మీ సొంతం.. నెలకు EMI ఎంతంటే?
MG Hector Variant : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఎంజీ మోటార్స్ నుంచి ఎంజీ హెక్టార్ అదిరిపోయే డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- May 24, 2026 / 06:07 PM IST
MG Hector Variant
- మిడ్-సైజ్ SUVలో ఎంజీ హెక్టార్ అతి చౌకైన ధరకే
- రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోవచ్చు
- బేస్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాలంటే?
MG Hector Variant : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ నుంచి ఎంజీ హెక్టార్ అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. మిడ్-సైజ్ SUVలో ఎంజీ హెక్టార్‌ను జస్ట్ రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోవచ్చు. మీరు బేస్ వేరియంట్‌ను కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. మీరు నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎంజీ హెక్టర్ ధర ఎంతంటే? :
ఎంజీ మోటార్స్ హెక్టార్ కారును కూడా అందిస్తోంది. బేస్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఢిల్లీలో కొనుగోలు చేస్తే.. ఆన్-రోడ్ ధర సుమారు రూ. 13.87 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవుతుంది.
ఇందులో రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రూ. 1.20 లక్షల (RTO) ఛార్జీలు, రూ. 57,000 (ఇన్సూరెన్స్ ఛార్జీలు) ఉంటాయి. అదనంగా, రూ. 12,000 (పన్ను) ఛార్జీలు ఉంటాయి. దాంతో ఆన్-రోడ్ ధర రూ. 13.87 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుతుంది.
Read Also : OPPO Reno 16 Series : భారీ 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో ఒప్పో 2 కొత్త 5G ఫోన్‌లు.. ఫుల్ డిటెయిల్స్!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎంతంటే? :
మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. బ్యాంకు కేవలం ఎక్స్-షోరూమ్ ధరకే ఫైనాన్స్ చేస్తుంది. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేశాక బ్యాంకు నుంచి సుమారుగా రూ. 11.87 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ బ్యాంకు మీకు రూ. 11.87 లక్షలను 7 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీకి రుణం ఇస్తే.. రాబోయే 7 ఏళ్ల పాటు నెలకు కేవలం రూ. 19,110 ఈఎంఐ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
కారు ధర ఎంతంటే? :
మీరు బ్యాంకు నుంచి రూ.11.87 లక్షల కారును ఏడేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే.. ఏడేళ్లపాటు నెలకు రూ. 19,110 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఎంజీ హెక్టర్ కోసం ఏడేళ్లలో సుమారుగా రూ. 4.17 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. ఆ తర్వాత, ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్, వడ్డీతో కలిపి కారు మొత్తం ఖరీదు సుమారుగా రూ. 18.05 లక్షలు అవుతుంది.
ఎవరితో పోటీ? :
ఎంజీ హెక్టార్‌ను మిడ్-సైజ్ SUVగా అందిస్తుంది. మార్కెట్‌లోని అనేక SUVల నుంచి పోటీ ఉన్నా టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా XUV 7X0, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ వంటి వాటితో నేరుగా పోటీపడుతుంది.
