Samsung Galaxy S24 Ultra Leak : టైటానియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ అప్‌గ్రేడ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S24 Ultra Leak : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ ఫోన్ 56శాతం బలమైన టైటానియం ఫ్రేమ్‌తో అప్‌గ్రేడ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung's Galaxy S24 Ultra Tipped to Offer 24-Megapixel Default Camera Output Resolution

Samsung Galaxy S24 Ultra Leak : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే ఈ ఎస్24 అల్ట్రా మోడల్ ఫీచర్లు లీక్ అయ్యయి. రాబోయే ఈ ఫోన్‌లో 56శాతం బలమైన టైటానియం ఫ్రేమ్‌, అప్‌గ్రేడ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గొరిల్లా గ్లాస్ ఆర్మర్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, మెరుగైన శీతలీకరణకు స్టీమ్ చాంబర్ కూడా ఉన్నాయి.

Read Also : Samsung Galaxy Tab S8 : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 ఇదిగో.. కొత్త ధర ఎంతో తెలుసా?

2024 జనవరి 17న లాంచ్ అయ్యే ఛాన్స్ :
షెడ్యూల్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ జనవరి 17న అధికారికంగా లాంచ్ కానుందని రుమర్లు వినిపిస్తున్నాయి. లాంచ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ, టాప్-ఆఫ్-ది-లైన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా గురించి మరిన్ని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఫ్లాగ్‌షిప్ గత వెర్షన్ల మాదిరిగానే అదే కెమెరా హార్డ్‌వేర్‌తో రానుంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ కొన్ని ఏఐ ఆధారిత అప్‌గ్రేడ్‌లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 24ఎంపీ డిఫాల్ట్ కెమెరా అవుట్‌పుట్ రిజల్యూషన్‌ను ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. 200ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

డిఫాల్ట్ 24ఎంపీ ఫొటో రిజల్యూషన్ ఫీచర్ :
టిప్‌స్టర్ ప్రకారం.. శాంసంగ్ సిరీస్ కూడా డిఫాల్ట్‌గా 24ఎంపీ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15, గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 24ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను అందిస్తుంది. 12ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను కలిగిన గెలాక్సీ ఎస్23 అల్ట్రా నుంచి అప్‌గ్రేడ్ అవుతుంది. ఇంకా, కొత్త గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫొటో రీమాస్టర్ ఫీచర్‌తో రానుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

Samsung’s Galaxy S24 Ultra  

ఫొటోల నుంచి షాడోలు ఆటోమాటిక్‌గా డిలీట్ చేయడంలో సాయపడే ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ ఇప్పటికే లేటెస్ట్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్‌లలో అందుబాటులో ఉంది. పోర్ట్రెయిట్, రీమాస్టర్ లేదా డిలీట్ అనే మూడు సెట్టింగ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఎన్‌డీ ఫిల్టర్ అకా న్యూట్రల్-డెన్సిటీ ఫిల్టర్‌ని కూడా కలిగి ఉంటుంది. ఇది కలర్లను మార్చేటప్పుడు ఒరిజినల్ ఇమేజ్‌లలో లైటింగ్‌ని ఎడ్జెస్ట్ చేయడంలో సాయపడుతుంది.

8k వీడియో రికార్డింగ్ సపోర్టు :
గెలాక్సీ ఎస్24 అల్ట్రా 200ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటు ఏఐ-సపోర్టెడ్ ఆబ్జెక్ట్-అవేర్ ఇంజన్‌తో వస్తుందని అంచనా. కెమెరా సెటప్‌లో 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 5ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో 50ఎంపీ సెన్సార్, 10ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో 10ఎంపీ సెన్సార్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 8కె వద్ద వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఓవర్‌లాక్ చేసిన జీపీయూ, సీపీయూ కోర్‌లతో క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీలో రన్ అవుతుంది. టైటానియం ఫ్రేమ్‌లతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించడానికి కొత్త ఈవీ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉంది.

Read Also : Samsung Phones High Risk : శాంసంగ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే అప్‌‌డేట్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు