Teacher Assault : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

Teacher Tries To Assault Girl Student : ఈ విషయాన్ని బయటకు చెబితే నన్ను, నా తల్లిదండ్రులను చంపేస్తానని ఆ టీచర్ బెదిరించాడని బాధితురాలు వాపోయింది.

Teacher Assault : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

Teacher Tries To Assault Girl Student (Photo : Google)

గురువు అంటే దైవంతో సమానం అంటారు. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు మంచి మార్గంలో వెళ్లేలా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే. అందుకే గురువుకి అంత గౌరవం. అయితే, కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. దేవాలయంగా భావించే స్కూల్ లో వికృత చర్యలతో, కామ వాంఛలతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. కొందరు టీచర్ల విపరీత ప్రవర్తన అమ్మాయిల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

క్లాస్ రూమ్ లోనే లైంగిక దాడి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే విద్యార్థినిని ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. క్లాస్ రూమ్ లోనే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తొలుత తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్య సంజ్ఞలు చేశాడు. ఆ తర్వాత విద్యార్థిని దుస్తులు లాగే ప్రయత్నం చేశాడు. టీచర్ వికృత చేష్టలతో ఆ విద్యార్థిని భయపడిపోయింది. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసింది. ఆ కీచకుడు విద్యార్థిని లైంగికంగా వేధించడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

స్కూల్ టైమ్ అయిపోయినా వెళ్లనివ్వలేదు..
కోసికలాన్ ప్రాంతంలోని ఓ హైస్కూల్ లో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. కీచక టీచర్ ను గోవింద్ గా గుర్తించారు. అతడు కాంట్రాక్ట్ టీచర్. స్కూల్ సమయం ముగిసిన తర్వాత ఈ ఘోరం జరిగింది. స్కూల్ టైమ్ అయిపోయినా ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లోనే ఉండాలని టీచర్ గోవింద్ ఆదేశించాడు. ఇతర విద్యార్థులు అందరూ క్లాస్ రూమ్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు.

Also Read : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ దారుణం..
క్లాస్ రూమ్ లో ఇద్దరే ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. టీచర్ గోవింద్ తన ప్రైవేట్ పార్ట్స్ ను విద్యార్థినికి చూపించడం ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారయత్నం చేయడం ఇవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. ఆ కీచకుడి బారి నుంచి ఎలాగో తప్పించుకున్న విద్యార్థిని తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, ఈ విషయాన్ని బయటకు చెబితే నన్ను, నా తల్లిదండ్రులను చంపేస్తానని ఆ టీచర్ బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో టీచర్ గోవింద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఆడపిల్లకు రక్షణ ఏది?
కాగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే ఇలా కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారయత్నం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి దారుణాలు మరోసారి జరక్కుండా ఉండాలంటే ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే