పెన్షన్‌ కోసం వచ్చి ప్రాణాలొదిలాడు

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 04:16 PM IST
పెన్షన్‌ కోసం వచ్చి ప్రాణాలొదిలాడు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని దమ్మపేటలో విషాదం చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకులో పెన్షన్‌ తీసుకునేందుకు వచ్చి…65 ఏళ్ల వెంకప్ప ప్రాణాలు కోల్పోయాడు. బ్యాంకు వద్ద క్యూ లైన్ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి నిలబడ లేక అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అధికారుల నిర్లక్ష్యంతోనే వెంకప్ప మృతి చెందాడంటూ..మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. వెంకప్ప స్వగ్రామం దమ్మపేట మండలం చీపురుగూడెంగా గుర్తించారు.