కొలువుల బండి : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 03:49 AM IST
కొలువుల బండి : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలు

ఢిల్లీ : రైలు బండి వచ్చేసింది. కొలువుల జాతరను తెచ్చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే జోన్ల పరిధిలో 1.3 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.   రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ఈ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. వీటిలో 30 వేల ఖాళీలు నాన్ టెక్నికల్ పోస్టులు (ఎన్టీపీసీ), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ విభాగాలకు సంబంధించినవి కాగా.. మిగిలిన లక్ష ఉద్యోగాలు లెవల్-1 పరిధిలోని పోస్టులు ఉన్నాయి. ఆయా డిపార్ట్ మెంట్లలలో పోస్టుల ఆధారంగా విద్యార్హతలను అధికారులు నిర్ణయించారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 

నాన్ టెక్నికల్ పోస్టులకు ఫిబ్రవరి 28 నుంచి
పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు మార్చి 4 నుంచి
మినిస్టీరియల్ పోస్టులకు 8 నుంచి
లెవల్-1 పోస్టులకు మార్చి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభకానుంది. 

మొత్తం ఖాళీలు: 1.3 లక్షలు 

  • నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్టీపీసీ)…
  • జూనియ‌ర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
  • ట్రెయిన్ క్లర్క్‌
  • క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
  • ట్రాఫిక్ అసిస్టెంట్‌
  • గూడ్స్ గార్డ్‌
  • సీనియర్ క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
  • కమర్షియల్ అప్రెంటిస్
  • స్టేష‌న్ మాస్టర్ త‌దిత‌ర పోస్టులు
  • పారా మెడిక‌ల్ స్టాఫ్‌..
  • స్టాఫ్ న‌ర్స్‌
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్
  • ఫార్మసిస్ట్‌
  • ఈసీజీ టెక్నీషియ‌న్‌
  • ల్యాబ్ అసిస్టెంట్‌
  • ల్యాబ్ సూప‌రింటెండెంట్ తదితర పోస్టులు
  • మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ..
  • స్టెనోగ్రాఫ‌ర్‌
  • చీఫ్ లా అసిస్టెంట్‌
  • జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ) తదితర పోస్టులు

లెవ‌ల్-1 పోస్టులు..

  • ట్రాక్ మెయింటైన‌ర్‌ (గ్రేడ్-4)
  • హెల్పర్/అసిస్టెంట్ (టెక్నికల్)
  • గేట్‌మ్యాన్‌
  • అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్‌ తదితర పోస్టులు