ఎంపీసీ విద్యార్థులకు ఐఐఎస్ ఈఆర్ లో సైన్స్ కోర్సులు  

ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఉత్తమ ప్రత్యామ్నాయం.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ లు (ఐఐఎస్ఈఆర్).

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 05:54 AM IST
ఎంపీసీ విద్యార్థులకు ఐఐఎస్ ఈఆర్ లో సైన్స్ కోర్సులు  

ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఉత్తమ ప్రత్యామ్నాయం.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ లు (ఐఐఎస్ఈఆర్).

ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఉత్తమ ప్రత్యామ్నాయం.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ లు (ఐఐఎస్ఈఆర్). దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో (పుణె, బరంపూర్, బోపాల్, కోల్ కత, మొహాలీ, తిరువనంతపురం, తిరుపతి) ఉన్న ఐఐఎస్ఈఆర్ క్యాంపస్ లలో బీఎస్..ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశానికి కేవీపీవై ఎక్స్ స్ట్రీమ్ ఉత్తీర్ణతను లేదా జీఈఈ అడ్వాన్స్ డ్ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు.
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్

ఇవి రెండు లేకుంటే ఐఐఎస్ఈఆర్ ప్రత్యేకంగా నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ర్యాంకు సాధించాలి. ఆ తర్వాత ఉమ్మడి కౌన్సెలింగ్ విధానం ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఐఐఎస్ఈఆర్ క్యాంపస్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్ షిప్ సదుపాయం కూడా ఉంది. 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభం కానుంది. 
Read Also : వినూత్న వివాహం : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే