అజారుద్ధీన్ కొడుకుతో సానియా మిర్జా చెల్లి పెళ్లి

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 09:54 AM IST
అజారుద్ధీన్ కొడుకుతో సానియా మిర్జా చెల్లి పెళ్లి

భారత జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్ధీన్ కుమారుడు అసద్ పెళ్లి ప్రముఖ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలితో జరగబోతుంది. గత కొలంగా అసద్, సానియా చెల్లి ఆనమ్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుంది.   25ఏళ్ల అసద్.. 28ఏళ్ల ఆనమ్‌లు తమ మధ్య ఉన్న బంధాన్ని  పెళ్లిగా మార్చుకోబోతున్నట్లు చెబుతున్నారు.
Also Read : అదేంటి: జార్ఖండ్‌కు పరాయివాడ్ని చేయొద్దంటోన్న ధోనీ

ఆనమ్‌ మిర్జా 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి గతేడాది ఆనమ్ విడాకులు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల వారికి విడాకులు మంజూరు అయినట్లు తెలుస్తుంది. విడాకుల అనంతరం అసద్‌తో ఆనమ్ సన్నిహితంగా మెలుగుతుంది. వీరి ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లలో కనిపిస్తున్న కొన్ని పోటోలను చూస్తుంటే వీరి నిఖా పక్కా అయినట్లే తెలుస్తుంది. 

మీడియా కథనాలు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం అసద్, ఆనమ్ ప్రేమలో ఉండగా వారి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే, వాళ్ల కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఆఖరిలో ఇద్దరూ పెళ్లి చేసుకోనునట్లు తెలుస్తోంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

☀️

A post shared by Asad (@asad_ab18) on

Also Read : ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్