అమెరికా షట్ డౌన్ : వ్యాపారులు దివాలా
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం పాక్షికంగా మూతపడటంతో వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూతపడి రెండో వారానికి చేరుకుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం పాక్షికంగా మూతపడటంతో వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూతపడి రెండో వారానికి చేరుకుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం పాక్షికంగా మూతపడటంతో వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూతపడి రెండో వారానికి చేరుకుంది. ఇప్పటికే పలు వ్యాపారాలు నిలిచిపోయాయి. రవాణా, వాణిజ్యం, వ్యవసాయం, ట్రెజరీ వంటి కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో వారానికి రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అందులోనూ హాలీడే సీజన్ కావడంతో ప్రభావం భారీ స్థాయిలో ఉంది. దేశం వ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు దివాలా తీయడంతో వచ్చే రెవిన్యూ భారీగా పడిపోయింది. చేసేది ఏం లేక తమ ఉద్యోగులను వెంటనే ఇంటికి పంపేస్తున్నారు.
న్యూ ఇయర్ వేళా.. వెలవెల
ఒక్లాండ్ లో శామ్ శామ్ ఔరీ కార్నర్ కేఫ్ ఒకటి ఉంది. మొత్తం 18 ఫోర్లు ఉంటాయి. ఈ వీధిలో ఇదే అతిపెద్ద బిల్డింగ్. ఇక్కడికి పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చి పోతుంటారు. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ఈ కేఫ్.. ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో న్యూ ఇయర్ రోజున వెలవెలబోయింది. ఒక్క కస్టమర్ వస్తే ఒట్టు.. లంచ్ టైమ్ లో ఇసుక వేస్తే రాలనంత మంది వచ్చేవారు.. ఇప్పుడు కేఫ్ ఉద్యోగులు ముగ్గురు మాత్రేమే ఉన్నారు. వ్యాపారమంతా దివాలా తీసిందని కేఫ్ యజమాని బోరమంటున్నాడు. కొన్ని వ్యాపారాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన లోన్లు ఆపేయడంతో వారి పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది. కస్టమర్లు లేక పార్కులు, రెస్టారెంట్లు వెలవెలబోయి తెగ వర్రీ అవుతున్నాయి.
డిసెంబర్ 22న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్ అయింది. నిర్ణీత కాల వ్వవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు అవసరం ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కావడానికి మొత్తం 60 ఓట్లు అవసరం ఉండగా 48 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో బిల్టు ఆమోదానికి నోచుకోలేదు. ప్రభుత్వం మూతపడటంతో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయాయి.