పబుక్ తుపాన్ : థాయిలాండ్ వైపు పయనం

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 07:45 AM IST
పబుక్ తుపాన్ : థాయిలాండ్ వైపు పయనం

బ్యాంకాక్ : థాయిలాండ్ వణుకుతోంది. పబుక్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాన్‌తో తీర ప్రాంతాలు గజ గజ వణుకుతున్నాయి. తీరం తాకిన తరువాత తన కోపాన్ని చూపెట్టింది. చెట్లు..విద్యుత్ స్తంభాలు..ఇళ్లు నేలకూలాయి. సముద్రపు అలలు సుమారుగా 20 అడుగుల మేర ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి.
ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్…
తాజాగా అండమాన్ దీవులకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తుపాన్ గత ఆరు గంటలుగా 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ సాయంత్రానికి అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని హెచ్చరించింది. 
సహాయక చర్యలు…
అక్కడి అధికారులు ముందే సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను..ఇతరులను సురక్షిత ప్రాంతాలకు..పునరావాస కేంద్రాలకు తరలించేశారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృమైన ఈ తుపాన్‌తో అండమాన్‌ దీవుల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మయన్మార్‌ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.