గర్ల్ ఫ్రెండ్ లేదు : అమ్మాయిలందర్నీ చంపేస్తా 

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 10:58 AM IST
గర్ల్  ఫ్రెండ్ లేదు : అమ్మాయిలందర్నీ చంపేస్తా 

ఫేస్ బుక్ లో వివాదాస్ప కామెంట్
అమ్మాయిలపై ద్వేషం
చంపేస్తానంటు పోస్ట్..అరెస్ట్ 

ప్రోవో : ఫేస్ బుక్..రూపాయి ఖర్చు లేకుండా పలు సంచలనాలకు దారి తీస్తోంది. ఎవరికి ఇష్టమొచ్చిన పోస్ట్ లు వారు పెట్టేసుకుంటుంటారు. అంతేకాదు ఫేస్ బుక్ వేదికగా జరిగే సంచలనాలెన్నో. వివాదాలు కూడా అంతస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ 27ఏళ్ల యువకుడు పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారి  కటకటాలపాలయ్యాడు. 

అమెరికాలోని ఉటాహ్‌ రాష్ట్రంలోని ప్రోవో నగరానికి చెందిన 27 ఏళ్ల క్రిస్టోఫర్ డబ్ల్యు. క్లియరీ అనే యువకుడు ఫేస్‌బుక్‌ అమ్మాయిలపై వున్న ద్వేషాన్నంతా రంగరించి సంచలన పోస్టు పెట్టాడు. ‘‘నాకు గాళ్ ఫ్రెండ్ లేనందు వల్ల నాకు కనిపించిన బాలికలను..అమ్మాయిలందర్నీ చంపేస్తాను’’అని క్రిస్టోఫర్ డబ్ల్యు. క్లియరీ పోస్టు చేశాడు. జనవరి 19న  మహిళా ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించిన అదే వారం చివరిలో క్రిస్టోఫర్ ఈ పోస్ట్ పెట్టటం గమనించాల్సిన విషయం. ఈ పోస్ట్ చూసిన కొంతమంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీన్ని నిర్ధారించుకున్న ప్రోవో నగర పోలీసులు క్రిస్టోఫర్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తనకు సామూహికంగా బాలికలను కాల్చి చంపాలని ఉందని క్రిస్టోఫర్ పోలీసుల ముందుకూడా ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.