Bumper Offer : నా కూతురిని పెళ్లి చేసుకుంటే రూ.2కోట్లు ఇస్తా

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 04:14 PM IST
Bumper Offer : నా కూతురిని పెళ్లి చేసుకుంటే రూ.2కోట్లు ఇస్తా

పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లేదు అనే పరిస్థితిలో వరకట్నం ఘటనలు చాలావరకు తగ్గిన మాట వాస్తవమే. అయితే తన కూతురిని పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్న అబ్బాయికి మాత్రం రూ.2కోట్లు ఇస్తాను అంటున్నాడు ఒక వ్యాపారవేత్త. వరకట్నం ఇవ్వడం నేరం కదా! అనుకుంటున్నారా? ఇది కట్నం కింద కాదు కానుకగా మాత్రమే.

థాయ్‌లోని చుంపోన్‌ ప్రావిన్సుకు చెందిన ఆర్నోన్‌ రోడ్తాంగ్‌ అనే వ్యక్తికి 26 ఏళ్ల కర్నిసితా రోడ్తాంగ్‌ అనే కూతురు ఉంది. ఆమె చదువు యావలో పడి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందట. దీంతో ఎన్నోసార్లు ఆమెను బతిమిలాడినా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక ఆర్నోన్‌ ఇలా బహిరంగ ప్రకటన ఇచ్చేశారు.

తన కూతుర్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలట. కర్నిసితా చైనీస్‌, ఇంగ్లీష్‌ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. ఈమెను చేసుకోబోయేవాడు స్మార్ట్‌గా ఉండకపోయినా పర్వాలేదు కానీ చదవడం, రాయడం వస్తే చాలు. డిగ్రీలు చదివున్నవాడు అవసరం లేదట. కష్టపడేవాడైతే చాలట. డబ్బుని ప్రేమించకుండా మనుషులని అర్థం చేసుకునే వాడు, తన బిజినెస్‌ లావా దేవీల గురించి తెలిసిన వాడు కావాలట. ఈ మూడు లక్షణాలున్న ఏ అబ్బాయికి అయినా తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటున్నాడు. అంతేకాదు తన కూతురిని పెళ్లి చేసుకుంటే చాలు ఆస్తి మొత్తం వాళ్లకే రాసిస్తాను అని అన్నారు.