హీరో, డైరెక్టర్ Lip Lock..ఫొటో వైరల్

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 12:57 AM IST
హీరో, డైరెక్టర్ Lip Lock..ఫొటో వైరల్

సాధారణంగా..హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ లు ఉంటాయనే సంగతి తెలిసిందే. సినిమాలో కొద్దిగా మసాల దట్టించి..అక్కడక్కడ లిప్ కిస్ సీన్ లు పెడుతుంటారు దర్శకులు. అయితే..ఇక్కడ సీన్ రివర్స్. హీరో – డైరెక్టర్ ముద్దులు పెట్టుకున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. OTT ప్లాట్ ఫామ్ లో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ సినిమా విడుదలైంది. రవికాంత్ పెరుపు దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించారు. శ్రద్ధా శ్రీనాధ్‌, షాలిని వడ్నికట్టి నటించారు.

సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగింది. తాజాగా Netflixలో విడుదలైన ఈ మూవీ..మంచి టాక్ తెచ్చుకుంది. కానీ..హీరో – డైరెక్టర్ ల లిప్ లాక్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఏందీ ఇది ? అంటూ కొశ్చెన్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

‘క్షణం’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రవికాంత్. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ రెండో చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం చేపట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా..అదిగో..ఇదిగో..సినిమా రిలీజ్ అంటూ వాయిదా పడూతూ వచ్చింది. కరోనా టైంలో లాక్ డౌన్ అమల్లో ఉండడంతో రిలీజ్ అవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. మోడ్రన్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. 

Read: రజనీ లుక్ వెనుక రహస్యం తెలిసింది