అనుకోకుండా ఓ రోజు: అబ్బాయి నిద్ర లేవగానే అమ్మాయిలా మారిపోతే?

అనుకోకుండా ఓ రోజు: అబ్బాయి నిద్ర లేవగానే అమ్మాయిలా మారిపోతే?

ఎందరో సంఘ సంస్కర్తలు, వీర వనితల జీవితాల త్యాగ ఫలంతో మహిళలలు దాదాపు సమాజంలో ధైర్యంగానే తిరిగేస్తున్నారు. పాత కాలం నాటి సంప్రదాయాలను పక్కకు పెట్టి అనుకూలంగా ఉండే ప్యాంట్ షర్ట్‌లలో దూరి మగవారి వేషధారణలో ఒదిగిపోతున్నారు.
మగవాళ్లు మాత్రం ఎప్పటికీ మగవాళ్లే. అనుకోకుండా ఒకరోజు నిద్రలేవగానే ఆడవాళ్లు అయిపోతే.. అప్పుడేంటి పరిస్థితి. ఇదే ప్రశ్న కొందరు పురుషులను అడిగితే వచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయంటే.. 

1. నేను సాధ్యమైనంత అందంగా తయారవుతా. ఎందుకంటే అలంకరించుకునేందుకు మగాళ్ల కంటే ఆడాళ్లకే ఎక్కువ అవకాశాలుంటాయి కదా. అదో గొప్ప ప్రయోగమే అనుకుంటున్నా. 

2. నాకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి గురించి తెలుసుకోవాలనుంది. 

3. నా ఫీమేల్ ఫ్రెండ్‌ను పిలిచి సెక్స్ అనుభవం గురించి చర్చిస్తా. ఇప్పటి వరకూ లేడీస్ సెక్స్ లైఫ్ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనుంది. 

4. అమ్మో.. ఆ రోజు నాకు పీరియడ్ రాకుండా ఉంటే బాగుండు. ఆ నొప్పి సంగతేంటో ఓ సారి భరిస్తే గానీ తెలియదు. 

5. నేనేం చేస్తాననుకుంటున్నారు. కచ్చితంగా నా శరీర అందాన్ని చూసుకుంటూ ఉండిపోతా.

6. లేడీస్ నైట్‌కి వెళ్లి వారితో పాటు డ్రింక్ తాగి రచ్చ చేస్తా. 

7. నేను కచ్చితంగా స్వయం తృప్తి చేసుకుని సంతోషపడతా. ఎందుకంటే మహిళలల్లో సెక్స్ పరంగా ఆనందించడానికి చాలా విషయాలుంటాయి కాబట్టి. 

8. రోజంతా మగాళ్లకు సైట్ కొడతా. మగాళ్లకు ఎంత ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చోనన్న విషయం తెలుసుకోవాలనుంది. 

9. వెంటనే పడుకుంటా. నా జననాంగం తిరిగొచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తా.