అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 05:19 AM IST
అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ త‌న బ‌ర్త్‌డే వేడుకల‌ని స్నేహితులు, బంధువుల మధ్య అర్ధ‌రాత్రి గ్రాండ్‌గా జ‌రుపుకుంది. అలియా బ‌ర్త్‌డే పార్టీలో డిజైన‌ర్ మ‌స‌బ గుప్తా, చిన్న‌నాటి స్నేహితురాలు అనుష్క రంజ‌న్‌తో పాటు ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం అలియా భ‌ట్ బ‌ర్త్‌డేకి సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ నిర్మాత‌..ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ డ్రీమ్ ప్రాజెక్ట్ క‌ళంక్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్న అలియా బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రం చేస్తుంది. ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అంతేకాదు త‌క్త్ అనే చారిత్రాత్మక చిత్రంలో కూడా న‌టిస్తుంది అలియా. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌, కరీనా కపూర్‌, అలియా భట్‌, విక్కీ కౌశల్‌, భూమి ఫెడ్నేకర్‌, అనిల్‌ కపూర్‌లు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. రాజ‌మౌళి RRR ప్రాజెక్ట్‌లో చ‌రణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కూడా న‌టిస్తుంది అలియా భ‌ట్. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్న‌ట్టు టాక్.