అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు ఎమ్మెల్యే

బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని వరసగా సినిమాలు చేస్తోంది అనసూయ. క్షణం సినిమాలో  పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన అనసూయ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 09:32 AM IST
అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు ఎమ్మెల్యే

బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని వరసగా సినిమాలు చేస్తోంది అనసూయ. క్షణం సినిమాలో  పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన అనసూయ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని వరసగా సినిమాలు చేస్తోంది అనసూయ. క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన అనసూయ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు రంగమ్మత్త పాత్ర కూడా హైలైట్ అయింది…దాంతో అనసూయకు డిమాండ్ పెరిగింది. సినిమా ఆఫర్లు వస్తున్నా ఆమె కొన్ని సినిమాలను మాత్రమే ఎంచుకొని నటిస్తుండటం విశేషం. ఇటీవలే రిలీజైన ఎఫ్2 లో చిన్న పాత్రే అయినప్పటికీ అందులో అద్భుతంగా నటించి మెప్పించింది అనసూయ. 

ఇక ఇప్పుడు ప్రస్తుతం అనసూయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర అనే బయోపిక్ సినిమాలో నటిస్తుంది. అనసూయ ఇందులో ఎమ్మెల్యే రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గౌరు చరితా రెడ్డి పాత్రలో అనసూయ కనిపిస్తుందట. 2004 లో చరితా రెడ్డి నందికొట్కూరు నియోజక వర్గం నుంచి గెలుపొందింది. విజయం సాధించడానికి ఎలా కష్టపడిందనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
మహి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.