Rakshita Suresh: ‘హల్లల్లల్లో’ సాంగ్ తో సోషల్ మీడియా షేక్.. ఎవరీ రక్షితా సురేశ్?.. తెలిస్తే షాక్ అవుతారు!
హల్లల్లల్లో సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సింగర్ రక్షితా సురేశ్(Rakshita Suresh).
- V Santhosh Kumar
- Published on- May 24, 2026 / 05:48 PM IST
Singer Rakshita Suresh shaking up social media with Hallallallo song
- ‘పెద్ది’ సాంగ్‌తో రక్షితా సురేశ్ సంచలనం.
- ఇళయరాజా పరిచయం చేసిన కన్నడ గాయని.
- రెహమాన్ ఫేవరెట్ సింగర్‌గా క్రేజ్.
Rakshita Suresh: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ నుండి విడుదలైన ‘హల్లల్లల్లో’ (Hellallallo) ప్రత్యేక గీతం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆదివారం ఉదయం విడుదలైన ఈ మాస్ నంబర్‌ను తన గమ్మత్తైన గాత్రంతో గాయని రక్షితా సురేశ్(Rakshita Suresh) ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసతో సాగే ఈ పాట రక్షితా సురేశ్ రెగ్యులర్ శైలికి పూర్తి భిన్నమైనప్పటికీ, ఆమె తన అద్భుతమైన వాయిస్‌తో ఈ సాంగ్‌కు ప్రాణం పోశారు. కర్ణాటకకు చెందిన ఈ టాలెంటెడ్ సింగర్ చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతంలో కఠినమైన శిక్షణ తీసుకుని, పలు రియాలిటీ షోలలో విన్నర్‌గా, రన్నరప్‌గా నిలిచి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు.
Balakrishna: సినీ పరిశ్రమ రాజధానిగా ఆంధ్రప్రదేశ్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
మైసూరుకు చెందిన రక్షితా సురేశ్ గాయనిగా ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమతోనే ప్రారంభం కావడం విశేషం. ప్రముఖ సంగీత పరిశ్రమ దిగ్గజం ఇళయరాజా ఆమెను ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (2015) సినిమాలోని ‘చల్లగాలి తాకుతున్న’ అనే మధురమైన గీతంతో పరిచయం చేశారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో ‘ముత్యాల చెమ్మ చెక్క’ పాటతో రక్షిత తనలోని మరో వైవిధ్యాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ మూవీలోని ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’, ‘ది లెజెండ్’ చిత్రంలోని పాటలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరయ్యారు. హిప్‌హాప్ తమిళ, జీవీ ప్రకాశ్‌కుమార్ వంటి లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమె పనిచేశారు.
ఆమె కెరీర్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ‘మిమీ’ చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్.. ఆ తర్వాత ‘లైఫ్ ఆఫ్ ముత్తు’, ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’, ‘మామన్నన్’, ‘ఆడు జీవితం’, ‘థగ్‌లైఫ్’ వంటి ఎన్నో భారీ చిత్రాల వరకు కొనసాగింది. రెహమాన్ నిర్వహించే లైవ్ కాన్సర్ట్‌లలో కూడా రక్షితా సురేశ్ రెగ్యులర్ సింగర్‌గా సందడి చేస్తుంటారు. మెలోడీలు, క్లాసికల్ సాంగ్స్‌తో అలరించిన ఈ బ్యూటిఫుల్ సింగర్, ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలోని ‘హల్లల్లల్లో’ మాస్ బీట్‌తో బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ సృష్టిస్తూ తన క్రేజ్‌ను డబుల్ చేసుకున్నారు.
