Usha Uthup Husband : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ సింగర్ భర్త మృతి..

ఉష ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ తో మరణించారు.

Usha Uthup Husband : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ సింగర్ భర్త మృతి..

Star Singer Usha Uthup Husband Jani Chacko Uthup Pssed away with Heart Attack

Usha Uthup Husband : బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళం.. ఇలా అన్ని భాషల్లో ఎన్నో పాటలతో ప్రేక్షకులని మెప్పించింది ఉషా ఉతుప్. స్టార్ సింగర్ గా ఎదిగి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకుంది. ప్రస్తుతం వయసు పెరగడంతో అడపాదడపా పాటలు పాడుతూ టీవీ షోలలో కనిపిస్తున్నారు ఉషా ఉతుప్. తాజాగా ఉషా ఉతుప్ భర్త మరణించారు.

Also Read : Trisha – Brinda : త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ ‘బృంద’ టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి..

ఉష ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ తో మరణించారు. నిన్న రాత్రి కోల్‌కత్తా లోని ఇంట్లో ఉండగా జానీ చాకోకి హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ ఈ మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ళ వయసులో ఈయన మరణించారు. దీంతో ఉషా ఉతుప్, ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఉషా ఉతుప్ భర్త జానీ చాకో మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Star Singer Usha Uthup Husband Jani Chacko Uthup Pssed away with Heart Attack