FunMoji Team : యూట్యూబ్ లో కామెడీ నుంచి వెండితెరపైకి సీరియస్ సబ్జెక్టుతో..

యూట్యూబ్‌లో తమ కామెడీ వీడియోలతో అందర్నీ ఆకట్టుకుంది ఫన్ మోజీ.

FunMoji Team : యూట్యూబ్ లో కామెడీ నుంచి వెండితెరపైకి సీరియస్ సబ్జెక్టుతో..

Youtube Fame Funmoji Team Entry into Film Industry

Updated On : February 11, 2025 / 3:03 PM IST

FunMoji Team : యూట్యూబ్ లో ఫన్‌మోజీ ఛానల్ తో అందర్నీ నవ్విస్తున్న టీమ్ ఇప్పుడు వెండితెరపైకి రానుంది. యూట్యూబ్‌లో తమ కామెడీ వీడియోలతో అందర్నీ ఆకట్టుకుంది ఫన్ మోజీ. ఇదే టీమ్ మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్స్ పై సుశాంత్ మహాన్ హీరోగా కె.సుధాకర రెడ్డి, రవి నిర్మాణంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also Read : NTR – Vijay Deverakonda : రౌడీ స్టార్ కోసం రానున్న మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ ఫోటో వైరల్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ పాత కోట, పాడుబడిన చెట్టు, ఓ పెద్దావిడ, హీరో రగ్డ్ లుక్, ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా.. ఇలా చాలా అంశాలను చూపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుటే.. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఏదో అడ్వెంచరస్ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

Youtube Fame Funmoji Team Entry into Film Industry

ఇటీవల హీరో సుశాంత్ మహాన్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తి నెలకొనేలా చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.