Bihar Assembly Election Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ.. లైవ్ అప్డేట్స్
Bihar Assembly Election Results: బిహార్లో ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్డీఏ ముందంజలో ఉంది.
Bihar Assembly Election 20025 Results
Bihar Assembly Election Results: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ఎన్డీఏ 136, మహాఘట్బంధన్ 69, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్ నమోదైంది.
దీంతో విజయం ఎవరిని వరించనుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
బిహార్ ఎన్నికలు- 2025 ఇలా జరిగాయ్..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. 243 స్థానాల బిహార్ అసెంబ్లీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.
ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనతా దళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ 101 స్థానాల చొప్పున పోటీ చేయగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా తలా 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మహాఘట్బంధన్లో రాష్ట్రీయ జనతా దళ్ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో, సీపీఐ 9, సీపీఎం 4, సీపీఐ(ఎం-ఎల్)ఎల్ 20, వికాస్శీల ఇన్సాన్ పార్టీ 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలు
- రాష్ట్రీయ జనతా దళ్
- జనతా దళ్ (యునైటెడ్)
- భారతీయ జనతా పార్టీ
- లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్
- వికాస్శీల ఇన్సాన్ పార్టీ
- జన సురాజ్ పార్టీ
- హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)
- రాష్ట్రీయ లోక్ మోర్చా
