వినియోగదారులకు ఊరట : చెల్లింపు ఛానళ్ల ఎంపికకు గడువు పెంపు
కేబుల్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. చెల్లింపు ఛానళ్ల ఎంపికకు ట్రాయ్ గడువు పెంచింది. మరో నెల గడువు పొడిగించింది. ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ వోలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ట్రాయ్ గడువు పెంచింది.
కేబుల్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. చెల్లింపు ఛానళ్ల ఎంపికకు ట్రాయ్ గడువు పెంచింది. మరో నెల గడువు పొడిగించింది. ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ వోలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ట్రాయ్ గడువు పెంచింది.
ఢిల్లీ : కేబుల్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. చెల్లింపు ఛానళ్ల ఎంపికకు ట్రాయ్ గడువు పెంచింది. మరో నెల గడువు పొడిగించింది. ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ వోలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ట్రాయ్ గడువు పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలు కానున్నాయి. నూతన ఛానళ్ల ఎంపిక ప్రక్రియ ద్వారా వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని ట్రాయ్ వెల్లడించింది.
జనవరి 31 వరకూ ఛానళ్ల ప్రసారాల్లో కోతలుండవు..
కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల ఆందోళనతో కొత్త నిబంధనల అమలును ట్రాయ్ మరో నెల రోజులు వాయిదా వేసింది. జనవరి 31 వరకూ ప్రస్తుతం అందిస్తున్న ఛానళ్లను యధావిధిగా అందించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 వరకూ ఛానళ్ల ప్రసారాల్లో కోతలుండవని.. జనవరి 21 లోగా వినియోగదారుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ట్రాయ్ పేర్కొంది. కేబుల్ టీవీ వినియోగదారులు చెల్లింపు ఛానళ్లు ఎంచుకోవడానికి మరింత గడువు అవసరం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ అధికారులు ప్రకటించారు.
గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ వోలతో సమావేశమైన తర్వాత ట్రాయ్ కార్యదర్శి ఎస్.కే గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. కొత్త విధి విధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు మరి కొంత సమయం కావాలని ఎంఎస్ వోలు, ఆపరేటర్లు కోరడంతో జనవరి 31 దాకా గడువును పొడిగించారు.