ఇండియా ఫస్ట్ హైస్పీడ్ ట్రైన్ : పట్టాలెక్కనున్న వందేమాతరం 

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 04:38 AM IST
ఇండియా ఫస్ట్ హైస్పీడ్ ట్రైన్ : పట్టాలెక్కనున్న వందేమాతరం 

ఢిల్లీ : దేశ తొలి సెమి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈరోజు (ఫిబ్రవరి 15)న  ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు.  ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ హైస్పీడ్ ట్రైన్ 9 గంటల 45 నిమిషాల్లో వారణాసికి చేరుకోనుంది. ఈ క్రమంలో కాన్పూర్, అలహాబాద్ వద్ద 40 నిమిషాల చొప్పున ఆగుతుంది. రైలు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ట్రైన్ లో ఉండే ఫెసిలిటీస్ గురించి ప్రసంగించనున్నారు. ఎన్నో ఫెసిలిటీస్ కలిగిన ఈ వందేమాతరం ట్రైన్ లో ప్రయాణిస్తే..ఈ రైలులో ప్రయాణించే వారికి విమాన ప్రయాణం అనుభూతి కలుగుతుంది.

వందేమాతరం ట్రైన్ స్పెషల్  
గంటకు 160 కిలో మీటర్ల స్పీడ్ 
16 ఏసీ బోగీలు
ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ కు రెండు బోగీలు 
మొత్తం ట్రైన్ లో 1,128 సీట్లు
ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, ఫెసిలిటీస్
కంఫర్టబుట్ సీట్స్, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు