కన్నడ పాలిటిక్స్ : యడ్యూరప్పపై ఎఫ్ఐఆర్ 

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 07:43 AM IST
కన్నడ పాలిటిక్స్ : యడ్యూరప్పపై ఎఫ్ఐఆర్ 

కర్ణాటక : బీజేపీ నేత యడ్యూరప్పపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జేడీఎస్..కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ గద్దెనెక్కాలని పలు కుట్రలు పన్నుతోందనీ..ఈ ఆలోచనతోనే జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రలోభ పెట్టారని ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేపులను కూడా కుమారస్వామి అసెంబ్లీలో విడుదల చేసి సంచలనం సృష్టించారు. దీనికీ మాకు ఎటువంటి సంబంధం లేదని యడ్యూరప్ప తేల్చిచెప్పారు. 
 

ఈ క్రమంలో బీజేపీలో చేరకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని యడ్యూరప్ప తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూర్ జిల్లా ఎస్పీ డి.కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు. యడ్యూరప్పతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో సీడీని జిల్లా ఎస్పీకి అందజేశారు. దీంతో రాయచూర్ పోలీసులు యడ్యూరప్ప సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. దీంతో యడ్యూరప్పపై రాయచూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.