ఓటరు నమోదుకు నేడే ఆఖరి అవకాశం

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 01:36 AM IST
ఓటరు నమోదుకు నేడే ఆఖరి అవకాశం

సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం ఈరోజు(15 మార్చి 2019)తో ముగియనుంది. ఇప్పటివరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోకున్నా, జాబితాలో పేరు లేకున్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి అవకాశం అని ఎన్నికల సంఘం చెప్పింది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓట్లను నమోదు చేసుకునేందుకు అర్హులు. కాగా http://eci.gov.in, http://www.nvsp.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.