ఎవరీ అథిర.. దేశం ఆమె వైపు ఎందుకు చూస్తోంది.

దేశవ్యాప్తంగా రెండు రోజులుగా అందరి నోటా వినిపిస్తున్న పేరు అథిర. కేవలం ఆమె ఒక్క ఫొటో కేరళ రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. రెండు రోజులుగా అసలు అథిర ఎవరు అంటూ సోషల్ మీడియాలో, గూగుల్ లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతుంది.

దేశవ్యాప్తంగా రెండు రోజులుగా అందరి నోటా వినిపిస్తున్న పేరు అథిర. కేవలం ఆమె ఒక్క ఫొటో కేరళ రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. రెండు రోజులుగా అసలు అథిర ఎవరు అంటూ సోషల్ మీడియాలో, గూగుల్ లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతుంది.

దేశవ్యాప్తంగా రెండు రోజులుగా అందరి నోటా వినిపిస్తున్న పేరు అథిర. కేవలం ఆమె ఒక్క ఫొటో కేరళ రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. రెండు రోజులుగా అసలు అథిర ఎవరు అంటూ సోషల్ మీడియాలో, గూగుల్ లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతుంది. మంగళవారం (జనవరి1)  స్రీ, పురుష సమానత్వంపై తమ ప్రభుత్వ చిత్తశుద్దిని నిరూపించుకొనేందుకు కేరళ సీఎం ఇచ్చిన పిలుపుతో మహిళలు ఉమెన్ వాల్ పేరుతో మానవహారం నిర్వహించారు. సర్ గూడ్ నుంచి తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల  సముద్ర తీరం వెంబడి రహదారులపై మహిళలంతా కలిసి మానవహారం నిర్వహించారు. అయితే ఈ ఉమెన్ వాల్ భారీ ర్యాలీ ముగిసిన అనంతరం మలప్పురంలో అథిర సహా ఓ మహిళ నాయకత్వంలోని చిన్న గ్రూప్ పబ్లిక్ మీటింగ్ నిర్వహించింది. ఆ మీటింగ్ లో అథిర కొన్ని నినాదాలు ఇచ్చింది. 

చేతిలో తన ఆరునెలల పసిపాపను పట్టుకొని … ఉమెన్ వాల్ విజయవంతం అయింది. మహిళలు విజయం సాధించారు. ఎవరు చెప్పారు ఇది ఫెయిల్ అయిందని, కేరళలోని రోడ్లపై మేము మహిళా వాల్ ని పూర్తి చేశాం అంటూ అథిర ఇచ్చిన నినాదాలు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అథిర ఒక్క ఫొటో చాలు ఓ మాతృమూర్తి సింపుల్ పవర్ తెలియడానికి, ఆ ఒక్క ఫొటో ఉమెన్ వాల్ బలాన్ని తెలియజేస్తుంది అంటూ నెటిజన్లు ఆ ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలిగా ఆమె దీనిపై మాట్లాడుతూ.. ‘‘నేను ఏం ఫీల్ అయ్యానో అదే చెప్పాను. అది వైరల్ అవుతుందని నాకు తెలియదు’’ అని చెప్పింది. ఆ నినాదాలు ఇచ్చిన తర్వాత తన పాపకి హిందుస్తానీ రాగ అని పేరు పెట్టినట్లు అథిర తెలిపింది. శబరిమల ఇద్దరు మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవడంపై అథిర ఆనందం వ్యక్తం చేశారు. 

ట్రెండింగ్ వార్తలు