పని రాక్షసుడికి రూ19 కోట్లు : 50 ఏళ్లలో ఒక్క సెలవూ వాడలా

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 07:25 AM IST
పని రాక్షసుడికి రూ19 కోట్లు : 50 ఏళ్లలో ఒక్క సెలవూ వాడలా

ఢిల్లీ: ఉద్యోగస్తులు ప్రతీ వారం వీక్లీ ఆఫ్..సెలవులు తీసుకోకుండా పని చేయటం మామూలే. ఉద్యోగస్తులకు ఇంక పనులేమీ ఉండవా..అని ప్రతీ ఉద్యోగి అనుకోకుండా ఉండరు. కానీ ఓ ఇంజనీర్ మాత్రం సెలవులెందుకు..పనిచేసుకోవాల్సిందే అంటు తన 50 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ లో ఒక్కటంటే..ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేశారు. అతని ఉద్యోగ సర్వీస్ లాగానే అతి పేరు కూడా చాలా చాలా పొగుడండోయ్. అతనే అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్. 

ప్రముఖ ఇన్ఫాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేసిన ఈ ఇంజనీర్ తన సర్వీస్ లోని 50 సంవత్సరాలలో  ఒక్క సెలవుకూడా తీసుకోకుండా కంపెనీ కోసమే రిటైర్మెంట్ వరకూ కష్టపడి పనిచేశారు. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ‘బిజినెస్ ఇన్‌సైడర్’ రిపోర్టును చూస్తే నమ్మక తప్పదు. 2018లో నాయక్ రిటైర్మెంట్ అయినప్పుడు ఆయన పడిన కష్టానికి రూ. 19 కోట్లు అందుకున్నారు. గడచిన 50 ఏళ్లలో అతను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని కారణంగా నాయక్ కు  ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము అందింది. 
 

వ్యాపార, నిర్మాణ రంగంలో నాయక్ అందించిన సేవలకుగాను ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవలకు చేసినవారికి ప్రకటించిన ఈ పురస్కారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఎల్‌అండ్ టీ వెంచర్‌లో 1965లో నాయక్ ఓ సాధారణ  జూనియర్ ఇంజినీర్‌గా విధులలో చేరారు. 1986లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందాక ఆయన విశేష సేవలు అందిస్తూ వచ్చారు.