petrol and diesel prices hiked : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎనిమిది రోజుల్లో మూడోసారి.. హైదరాబాద్‌లో లీటరు ఎంతంటే?
petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.
petrol and diesel prices hiked once again in india
petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్ పై 94పైసలు, డీజిల్ లీటర్ పై 96పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి (శనివారం) ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈనెలలో మూడోసారి కావడం గమనార్హం.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉధ్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. భారతదేశం తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 85శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల భారతదేశంలోని ఇంధన ధరలపై ఈ ప్రభావం భారీగా పడింది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు దాదాపు రూ. వెయ్యికోట్ల నష్టాలను చవిచూస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే ఈనెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు సార్లు పెరగ్గా.. తాజగా.. మూడోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రభుత్వ చమురు సంస్థలు ఈనెలలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై రూ.3 పెంచగా.. ఈనెల 19వ తేదీన రెండోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా.. మూడోసారి లీటర్ పెట్రోల్‌పై 94 పైసలు, లీటర్ డీజిల్‌పై 96 పైసలు పెరిగింది. దీంతో ఈనెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై సుమారు రూ.5 చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న వేళ రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కు చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.100.94కి పెరిగాయి. మరోవైపు.. సీఎన్జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ.1 పెంచుతున్నట్లు శనివారం ప్రకటన జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలను పెంచడం ఇది మూడోసారి.
