మూషిక భక్తి : బంగారు రింగులను ఎత్తుకెళ్లి..అమ్మవారికి 

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 05:26 AM IST
మూషిక భక్తి : బంగారు రింగులను ఎత్తుకెళ్లి..అమ్మవారికి 

బీహార్‌ : బంగారం వ్యాపారం చేసే ఓ సేట్ కు ఓ ఎలుక షాకిచ్చింది.  పాట్నాలోని నవరతన్ జువెల్లర్స్ అండ్ బ్రదర్స్ షాపు యజమాని అయిన ధీరజ్ కుమార్.. తన దుకాణంలో ఒక ఎలుక చేసిన ఘనకార్యాన్ని చెప్పటంతో ఆశ్చర్యపోవటం అందరి వంతు అయ్యింది. అదేమంటే..తన దుకాణంలో ఉన్న ఒక ప్లాస్టిక్ సంచి నుంచి  బంగారు చెవి రింగులను ఒక ఎలుక దొంగిలించిందట..ఇదే చిత్రం అనుకుంటే మరో విచిత్రం ఏమంటే.. ఆ బంగారు చెవి రింగులకు ఆ షాపులోనే ఉండే పార్వతి దేవి ఫోటోకి పెట్టిందంట (సమర్పించిందట) ఇది వినటానికి వింతగా ఉంది కదూ..
 

కానీ ఆ యజమాని మాత్రం ఆ ఎలుక చేసిన పనికి కోపగించుకోవటంలేదు సరికదా..అది మామూలు ఎలుక కాదు సాక్ష్యాత్తు దైవ స్వరూపం అంటున్నాడు. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పండుగ  కావడంతో.. తాను దానిని దైవ స్వరూపంగా భావించడానికి కారణమని తెలిపాడు. ఎలుక సంచిలో ఉన్న చెవి రింగులను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందట. అంతేకాదు.. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లేందుకు తన దుకాణాన్నే ఎంచుకున్నందుకు ధీరజ్ తెగ సంబరపడిపోతున్నాడు.
 

బీహార్ రాష్ట్రంలో మూషికాలకు (ఎలుకలు) చాలా పెద్ద చరిత్రే వుంది. ఏకంగా 200 కేన్ల మద్యం తాగాయని చెప్పి అక్కడి పోలీసులు ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్‌లోని ఒక బంగారం దుకాణం యజమాని ధీరజ్ తన షాపులోని ఎలుక చేసిన ఘనకార్యం గురించి చెప్పి..బీహార్ ఎలుకల చరిత్రలో మరో నూతన ఘట్టాన్ని ఆవిష్కరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.