ప్రభుత్వ ఉద్యోగులు గిఫ్ట్ లు తీసుకోవచ్చు

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 04:42 AM IST
ప్రభుత్వ ఉద్యోగులు గిఫ్ట్ లు తీసుకోవచ్చు

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం సంచనల నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు గిఫ్ట్‌గా తీసుకునే నగదును రూ.5 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల కండక్ట్ రూల్స్ 1973ని సవరిస్తు.. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ నెల 5న ఈ సవరణ చేసింది ప్రభుత్వం.ఈ తాజా సవరణతో గ్రూప్ ఎ, బి, సి, డిలలో ఉన్న ఉద్యోగులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, బంధువు, సన్నిహితుల నుంచి రూ.25 వేలకు మించకుండా గిఫ్టులు తీసుకోవచ్చు. కాగా ఇది ఇప్పటి వరకూ రూ.5 వేలకే పరిమితం అయి ఉండగా ప్రభుత్వం సవరణతో అదికాస్తా రూ.25 వేలకు చేరుకుంది. 
 

అంతేకాదు..గ్రూప్ ఎ, బి, సి, డిలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు రై.5 లక్షల వరకు వడ్డీ లేకుండా అప్పు (లోన్) తీసుకోవచ్చని పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గ్రూప్ బి, సి, డి కేటగిరీలో ఉన్న ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులు.. ఆయా సంస్థల నుంచి రూ.3 లక్షలకు మించి వడ్డీ లేని రుణం తీసుకోవడానికి వీల్లేదని కూడా స్పష్టంచేసింది ప్రభుత్వం.