Ballia: గర్ల్ ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఎందుకంటే?

దీంతో తీవ్రభావోద్వేగానికి గురై, క్షణికావేశంలో నాటు తుపాకీతో కాల్చుకున్నాడని సర్కిల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ వైభవ్ పాండే వివరించారు.

Ballia: గర్ల్ ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఎందుకంటే?

Ballia

Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన కొత్వాలీ పోలీసులు దీనిపై వివరాలు తెలిపారు. జమువా గోపాల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.

భార్యతో విభేదాల కారణంగా ఆమెకు 30 ఏళ్ల సోనూ అనే ఓ వ్యక్తి దూరంగా ఉంటున్నాడని చెప్పారు. అతడు గురువారం రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ వద్ద ఉన్న సమయంలో తన భార్యతో వీడియో కాల్ లో మాట్లాడాడని తెలిపారు. ఆ సమయంలో భార్యతో గొడవపడ్డాడని చెప్పారు.

దీంతో తీవ్రభావోద్వేగానికి గురై, క్షణికావేశంలో నాటు తుపాకీతో కాల్చుకున్నాడని సర్కిల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ వైభవ్ పాండే వివరించారు. అక్కడే ఉన్న సోనూ గర్ల్ ఫ్రెండ్ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిందని చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకోగానే ఘటనాస్థలికి వెళ్లామని అన్నారు. సోనూను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని అన్నారు.

Law Commission: లైంగిక సంబంధాల వయసుపై లా కమిషన్ కీలక వ్యాఖ్యలు