ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వివాదాస్పద రాజకీయ పోస్టులు, అసభ్యకర కామెంట్లపై కఠినంగా వ్యహరిస్తున్నట్టు ఇటీవలే సోషల్ మీడియా సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Published By: sreehari ,Published On : February 9, 2019 / 12:44 PM IST
ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వివాదాస్పద రాజకీయ పోస్టులు, అసభ్యకర కామెంట్లపై కఠినంగా వ్యహరిస్తున్నట్టు ఇటీవలే సోషల్ మీడియా సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వివాదాస్పద రాజకీయ పోస్టులు, అసభ్యకర కామెంట్లపై కఠినంగా వ్యహరిస్తున్నట్టు ఇటీవలే సోషల్ మీడియా సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న తరుణంలో పార్టీలు, రాజకీయ నేతల అకౌంట్లపై వాట్సాప్ నిఘా పెట్టింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ కు ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ షాక్ ఇచ్చింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఆయన వాట్సాప్‌ అకౌంట్‌ను బ్యాన్ చేసింది.  కొన్ని రోజుల నుంచి ఆయన వాట్సాప్ పనిచేయడం లేదు. మొబైల్ నెంబర్ పై వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయినట్టు సీఎం రమేశ్ కు ఓ మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ ఎందుకు బ్యాన్ చేశారో కారణం చెప్పాలని సదరు సంస్థకు ఆయన ఈ-మెయిల్ పంపారు.

దీనిపై స్పందించిన వాట్సాప్.. సీఎం రమేశ్ అకౌంట్ రద్దు చేయడంపై వివరణ ఇచ్చింది. సంస్థ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్టు అందిన ఫిర్యాదుల మేరకు యూజర్ల ప్రైవసీ దృష్ట్యా సీఎం రమేశ్ అకౌంట్ పై నిషేధం విధించినట్టు పేర్కొంది. టీడీపీ ఎంపీ రమేశ్ Whatsapp Account పై ఎవరు ఫిర్యాదు చేసారు అనేదానిపై మాత్రం మెసేంజర్ సంస్థ మాట దాటేసింది. ఫిర్యాదుదారుల వివరాలు చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. తన వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కావడంపై సీఎం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వమే వెనుక ఉండి ఇదంతా చేయించిందని ఆరోపించారు. 
 

తన అకౌంట్ బ్యాన్ చేయించడంపై కేంద్రం హస్తం ఉందని, లీగల్ గా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన అకౌంట్ బ్యాన్ చేయడానికి నేరంగా దేన్ని పరిగణనలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి తన వాట్సాప్ అకౌంట్ ను చాలా తక్కువగా వాడుతానని అన్నారు. ఆఫీసు నంబర్ తో ఈ Whatsapp Account లింక్ అయి ఉందని, ఇందులో పార్టీ ఎంపీల వాట్సప్ గ్రూపు మాత్రమే ఉన్నాయన్నారు.

పార్టీ వాట్సప్ గ్రూపులో కేవలం అధికారిక ఇన్మరేషన్ మాత్రమే షేర్ చేస్తుంటారని చెప్పారు. సడన్ గా Whatsapp Account   బ్యాన్ అనేసరికి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఈ ఇష్యూపై పార్లమెంటులో లేవనెత్తుతానని సీఎం రమేశ్ స్పష్టం చేశారు. తాను Whatsapp సంస్థ నిబంధనలను ఎంతమాత్రం ఉల్లంఘించలేదన్నారు. ఏ కారణంతో తన వాట్సప్ అకౌంట్ బ్యాన్ చేశారో కోర్టులోనే తేల్చుకుంటానని రమేశ్ చెప్పారు. 

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

Read Also:  డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ