ఎద్దు కాదు ఆవు: ఆ గాడిదలెవరు.. రైతు ఆగ్రహం!

  • Published By: vamsi ,Published On : March 17, 2019 / 10:49 AM IST
ఎద్దు కాదు ఆవు: ఆ గాడిదలెవరు.. రైతు ఆగ్రహం!

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సంధర్భంగా పసుపు కుంకుమ పథకం గురించి వివరిస్తూ ఒక యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో  ఓ మహిళ ఆవును, దూడను తోలుకుని వచ్చి పూజ చేస్తున్నట్లుగా ఉంటుంది. అయితే ఆ యాడ్‌లో కనిపించిన ఆవును ఎద్దుగా చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆవును ఎద్దు అంటూ బీజేపీ నేతలు విపరీతంగా విమర్శలు చేశారు.

ఈ క్రమంలో కంకిపాడు మండలం, కొలవెన్నుకు చెందిన ఆ ఆవు ఓనర్.. రైతు మండవ వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో వైసీపీపై మండిపడ్డారు. బీజేపీ నేతలకు కళ్లు కనిపించడం లేదని, అనుమానం ఉంటే వచ్చి ఆవును చూడాలన్నారు. తన గోమాతను ఎద్దు అన్న గాడిదలు ఎవరంటూ ఆగ్రహించారు. ఆవు, ఆవు వెంట దూడ వెళ్లడం స్పష్టంగా కనిపిస్తుంటే.. ఎద్దు అని ప్రచారం చేయడం దురదృష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును దెబ్బతీయడానికే తప్పుడు ప్రచారం మొదలు పెట్టారంటూ రైతు చెప్పుకొచ్చారు. దమ్ముంటే తన గ్రామం కోలావెన్ను వచ్చి ఆవును ఎద్దు అని నిరూపించాలంటూ సవాల్ విసిరారు.