అప్పగించేశారు: సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

  • Published By: raju ,Published On : March 13, 2019 / 03:50 PM IST
అప్పగించేశారు: సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

మరోసారి నిర్లక్ష్యాన్ని కనబరిచిన భారత్ 35 పరుగుల తేడాతో సిరీస్ ను చేజార్చుకుంది. తొలి 2 వన్డేలు గెలిచిన భారత్.. మిగిలిన 3 మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టులో ధోనీలేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఐదో వన్డేలో భారత్ ముందున్న 273 పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక చేతులెత్తేసింది.

ఈ పర్యటనను ఆస్ట్రేలియాకు ద్వైపాక్షిక సిరీస్ విజయంతో ముగించినట్లు అయింది. చేధనకు దిగిన భారత్.. 4.2 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయింది. నాల్గో వన్డేలో సెంచరీకి మించిన స్కోరుతో అలరించిన ధావన్(12) పరుగులకే క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే కోహ్లీ(20) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుస వికెట్లు చేజార్చుకున్న టీమిండియా ఒక్క వికెట్ మిగిలి ఉండగానే 35 పరుగుల తేడాతో మ్యాచ్ కోల్పోయినట్లు అయింది.

రోహిత్ శర్మ(56), పంత్(16), విజయ్ శంకర్(16), కేదర్ జాదవ్(44), రవీంద్ర జడేజా(0), భువనేశ్వర్ కుమార్(46), షమీ(3), యాదవ్(8), బుమ్రా(1)తో సరిపెట్టుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఇన్నింగ్స్‌ను చివరివరకూ దూకుడుగా కొనసాగించలేకపోయారు. దూకుడు మీదున్న ఆసీస్‌కు రవీంద్ర జడేజా బ్రేక్ వేశాడు. 14.3 ఓవర్లకు 76 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఆరోన్ ఫించ్(27; 43 బంతుల్లో 4 ఫోర్లు)ను పడగొట్టాడు. ఆ తర్వాత సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా(100)ను 32.6 ఓవర్లకు 175 పరుగుల వద్ద కోహ్లీ క్యాంచ్ అందుకోవడంతో భువీ బౌలింగ్‌లో మరో వికెట్ పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(1)ను మరో వికెట్‌గా రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు.

దాంతో ఊపందుకున్న భారత్.. ఆసీస్‌ను వికెట్లను వరుసగా పడగొట్టింది. పీటర్ హ్యాండ్స్‌కాంబ్(52), ఆష్టన్ టర్నర్(20), మార్కస్ స్టోనిస్(20), అలెక్స్ క్యారీ(3), పాట్ కమిన్స్(15), రిచర్డ్‌సన్(29)లుగా కట్టడి చేయడంతో 272 పరుగులు చేయగలిగింది.

ఖవాజా మరో సారి సెంచరీ: కెరీర్ ఆరంభం నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని ఉస్మాన్ ఖవాజా భారత్ పర్యటనలోనే తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 107బంతులు ఆడి సెంచరీ చేసిన ఖవాజా… ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న 4వ వన్డేలోనూ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ చేసి అద్భుతహ అనిపించాడు.