అదేంటి: జార్ఖండ్‌కు పరాయివాడ్ని చేయొద్దంటోన్న ధోనీ

అదేంటి: జార్ఖండ్‌కు పరాయివాడ్ని చేయొద్దంటోన్న ధోనీ

క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అదే దూకుడు.. అదే ఫినిషింగ్‌తో దూసుకెళ్తోన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించాడు. జార్ఖండ్ డైనమేట్‌గా పేరు సంపాదించిన మహేంద్ర సింగ్ ధోనీ..  లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ధోనీ గౌరవార్థం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్థానికంగా ఉన్న స్టేడియంలో మార్పులు చేసింది. 
Also Read : పాక్ బౌలర్ గ్రేట్ అంటోన్న శిఖర్ ధావన్

రాంచీలో ఉన్న జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ)లో పెవిలియన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్ అనే పేరు పెట్టింది. అయితే దీని ఆరంభోత్సవానికి ధోనీనే పిలవాలనుకుందట స్టేడియం యాజమాన్యం. ఈ విషయాన్ని ధోనీ ముందుంచగా ఆ ఆఫర్‌ను ధోనీ సున్నితంగా తిరస్కరించాడట. ఆ స్టేడియం ఆరంభోత్సవం చేయడానికి తానేం బయటివాడిని కాదని పేర్కొన్నాడట. 

స్టేడియం సెక్రటరీ.. డెబాశిస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ధోనీ ముందుంచినప్పుడు ‘దాదా మన ఇంట్లో జరిగే విషయానికి మనం ఆవిష్కరించడమేంటి’ అని ప్రశ్నించాడని వెల్లడించారు. ఇలా సొంతగూటిలో కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయించి తనను పరాయివాడిని చేయొద్దని అర్థంలో మాట్లాడడని తెలిపారు. ఇంత ప్రఖ్యాతులు సంపాదించిన అతనిలోని నిరాడంబరత ఏ మాత్రం తగ్గలేదని కొనియాడాడు. 

ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గౌరవార్థం ముంబైలోని వాంఖడే స్డేడియానికి గవాస్కర్ పేరు పెట్టారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో పెవిలియన్‌కు సెహ్వాగ్ పేరు పెట్టారు.
Also Read : ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్