అమ్మానాన్నలకు ఏం చెప్పాలి : గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్థి 

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 06:06 AM IST
అమ్మానాన్నలకు ఏం చెప్పాలి : గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్థి 

నల్లగొండ : నగరంలోని   పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద దారుణం జరిగింది. ఓ యువకుడి గొంతు కోసి పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. రాత్రంతా  తరుణ్ కుమార్ ను ఎవరు గమనించకపోవటంతో  అచేతనంగా  పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్ కు వెళ్లిన కొంతమంది అతన్ని గుర్తించటంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం సదరు బాధితుడు నుంచి వివరాలు రాబట్టారు. 
 

విచారణలో భాగంగా సదరు నిందితుడు చెప్పిన వివరాలకు వారు ఆశ్చర్యపోయారు. గుర్తు తెలియని దుండగులు విద్యార్థిపై దాడికి పాల్పడ్డారని భావించిన పోలీసులకు షాక్ ఇచ్చాడు సదరు బాధితుడు. మాచర్ల తరుణ కుమార్ తనకు తానే గొంతు కోసుకున్నానని తెలిపాడు. మొదట తనపై ఎవరో గుర్తు తెలియనివారు దాడి చేశారని తెలిపారు. తరువాత అసలు విషాయాన్ని బైటపెట్టారు. సూర్యాపేట జిల్లా కాసర్లకు చెందిన తరుణ్ కుమార్ ప్రగతి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ కు పరీక్షలు జరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలు రాసిన తరుణ్ చివరి పరీక్ష రేపు అంటే మార్చి 13న రాయాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షలు సరిగా రాయలేదనీ..ఫెయిల్ అయిపోతాననే భయంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలీయక అయోమయానికి గురయ్యాడు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తరుణ్ పోలీసులకు తెలిపాడు. కాగా ఇప్పటికే తరుణ్ తల్లిదండ్రులకు విషయాన్ని పోలీసులు తెలపటంతో వారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.