చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే : బొమ్మ ఆటో అడిగితే మినీ ఆటోనే తయారుచేసి ఇచ్చాడు

  • Published By: venkaiahnaidu ,Published On : January 23, 2019 / 06:48 AM IST
చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే  : బొమ్మ ఆటో అడిగితే మినీ ఆటోనే తయారుచేసి ఇచ్చాడు

సాధారంగా తల్లిదండ్రులు వారి పిల్లలు అడిగిన బొమ్మలు అన్నీ కొని వారిని ఆనందపరచాలని అనుకొంటారు. అయితే వారి వారి ఆర్థికపరిస్థితుల కారణంగా కొంతమంది తమ పిల్లలకు ఇంతకన్నా మంచిది, పెద్దది కొనిస్తాం అని వారికి సర్థిచెబుతుంటారు. అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి తన పిల్లలు అడిగిన బొమ్మలు కొనిచ్చే స్థోమత లేకున్నా తన తెలివితేటలతో వారిని ఆనందంలో ముంచెత్తాడు. ఆటో బొమ్మ కావాలి డాడీ అని అడిగిన పిల్లలకు ఏకంగా ఓ మినీ ఆటోనే చేతితో తయారుచేసి ఇచ్చి ఒక్క తన పిల్లలతోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కికి చెందిన అరుణ్ కుమార్ పురుషోత్తమ్ ఇడుక్కి జిల్లా హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక కూతరు కేశిని క్రిష్ణ, కొడుకు మాధవ్ ఉ్ననారు. ఒకరోజు డాడీ బొమ్మలు కావాలి అని ఇద్దరు పిల్లలు  అడగడంతో పురుషోత్తం తన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ వారికి ఏదో విధంగా ఓ బొమ్మను తయారుచేసి ఇచ్చి  ఆనందపరచాలనుకొన్నాడు.   వెంటనే ఓ  ఓ మినీ ఆటో రిక్షాను తయారుచేసి వారికిచ్చాడు. ఆ మినీ ఆటోలో చిన్నారులిద్దరూ ఆటలాడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మినీ ఆటోకి సుందరి అనే పేరు పెట్టాడు. 1990లో వచ్చిన ఏయ్ ఆటో సినిమా ప్రేరణతోనే తాను దీన్ని తయారుచేసినట్లు పురుషోత్తమ్ తెలిపారు. తన పిల్లలిద్దరూ ఆటోలో ఆనందంగా ఆటలాడుకొంటున్న వీడియోను పురుషోత్తం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

దీనిపై పురుషోత్తమ్ మాట్లాడుతూ.. తన తండ్రి కార్పెంటర్ గా పనిచేసేవాడని, తన తండ్రి దగ్గర ఉంటే పరికరాలు ుపయోగించి తాను అనేక బొమ్మలను తయారుచేశానని, ప్రత్యేకంగా వాహనాలని తయారుచేసినట్లు తెలిపారు. జీపు, ట్రై సైకిల్ వంటి వాటిని కూడా తయారుచేసినట్లు తెలిపారు. అయితే పురుషోత్తమ్ మినీ ఆవిష్కరణలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఆయన తన క్రియేషన్స్ ను అమ్మకోవడానికి ప్రయత్నించకపోవడం విశేషం. తనకు ఖాళీ సమయం దొరికితే ఇంకా ఎక్కువ మినీ ఆవిష్కరణలకు శ్రీకారం చుడతానని ఆయన తెలిపారు.